కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఎవరితో ఉంటారో ఇంకా ప్రకటించలేదు ..కానీ ఆయన మాత్రం ఓ ప్లాన్ తో ఉన్నారు. నామా నాగేశ్వరరరావును కేంద్ర మంత్రిని చేయాలనుకుంటున్నారు. కేంద్రంలో బీజేపీకి రెండు వందల సీట్లు దాటవు. అదే సమయంలో నాన్ బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. అందులో నామా కేంద్ర మంత్రిగా ఉంటారని ప్రకటించారు. నాన్ బీజేపీ అంటే .. కాంగ్రెస్ కూటమి అనుకోవాలి. కేసీఆర్ కాంగ్రెస్ కూటమిలో చేరేందుకు మానసికంగా సిద్ధమవుతున్నారా అనే డౌట్ ఈ కారణంగానే వస్తుంది.
రెండు కూటముల్లో లేని ప్రాంతీయ పార్టీలకు కనీసం పది సీట్లు వస్తాయని కూడా ఏ సర్వే చెప్పడం లేదు. రెండు కూటముల మధ్యే పోరు ఉంటోంది. పదేళ్ల పాటు అధికారంలో బీజేపీపై వ్యతిరేకత ఉందన్న భావనలో చాలా మంది ఉన్నారు. గత ఎన్నికల సమయంలోనూ అలాగే ఉన్నారు. కేసీఆర్ కూడా అదే అనుకున్నారు. అందుకే తనకు ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లేలా పూర్తిగా సహకరించిన బీజేపీని పార్లమెంట్ ఎన్నికల నాటికి డంప్ చేసేశారు. అవసరం అయితే.. కాంగ్రెస్ తో కలుస్తానని కూడా స్టేట్ మెంట్ ఇచ్చారు. ఇది బీజేపీ అగ్రనేతలకు అప్పట్లో ఆగ్రహం తెప్పించిందని చెబుతారు.
ఇప్పుడు కేసీఆర్ కు.. తాను బీజేపీకి సపోర్టు చేయను అని ధైర్యంగా చెప్పే పరిస్థితి లేదు. బీజేపీసీట్లు రావని.. నాన్ బీజేపీ కూటమి ఏర్పడుతుందని మాత్రం ఆశలతో ఉన్నారు. నిజానికి అలాంటి పరిస్థితి ఉందో లేదో కానీ.. తనకు వచ్చే సీట్లు ఏమైనా ఉంటే అవే క్రియాశీలకం అయినా సరే ఆయన ఖచ్చితంగా బీజేపీ వైపు మొగ్గుతారు కానీ.. కాంగ్రెస్ కూటమి జోలికి వెళ్లరన్న అభిప్రాయం ఉంది.