తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ పార్టీలు చాలా ఆస్తులు ఉన్నాయని.. పార్టీ భవిష్యత్‌కు ఢోకా లేదని ప్లీనరీ ముగిసంపు సమావేశంలో పార్టీ నేతలకు భరోసా ఇచ్చారు. విచిత్రంగా పార్టీకి ఉన్న ఆస్తులు.. సంపదపై ఎక్కువ సేపే మాట్లాడారు. రూ. 865 కోట్ల నిధులు టీఆర్ ఎస్ ఖాతాలో ఉన్నాయని కేసీఆర్ ప్రకటించారు. ఈ నిధుల్ని ఎస్బీఐ , బ్యాంక్ ఆఫ్ బరోడాలో దాచామని కేసీఆర్ ప్రకటించారు. మిగిలినవి స్థిరాస్థి రూపంలో ఉన్నాయి.ఢిల్లీలో తెలంగాణా భవనం సిద్ధం కాబోతోందని ప్రకటించారు.
మొత్తంగా టీఆర్ఎస్కు రూ. వెయ్యి కోట్ల ఆస్తులున్నాయన్నారు. ఒక్క పిలుపు ఇస్తే రూ. ఆరు వందల కోట్ల విరాళాలు వస్తాయన్నారు. పార్టీకీ అద్భుతమైన నిధులు సమకూర్చుకున్నామని జాతీయ రాజకీయాల్లో ఘనమైన పాత్ర పోషిస్తామని చెప్పుకొచ్చారు.టీఆర్ఎస్ విజయంపై వస్తున్న కారు కూతలు పట్టించుకోవద్దని కేసీఆర్ పార్టీ కార్యకర్తలకు సూచించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు మనదే.. ఏ మాత్రం సందేహం వద్దన్నారు. కన్సల్టెంట్ ను పెట్టుకున్నామని.. వారు చేసిన సర్వేలోనే 90 సీట్లు వస్తాయని తేలిందన్నారు.
ముగింపు సమావేశంలోనూ కేసీఆర్ బీజేపీపై.. దేస రాజకీయాలపై మాట్లాడారు. అంత వరకూ బాగానే ఉన్నాయి. టీఆర్ఎస్కు రూ. వెయ్యి కోట్ల ఆస్తులు… ఉన్నాయని.. అదే గొప్పగా ప్రకటించుకోవడం విమర్శలకు గురయ్యే అవకాశం ఉంది. అన్ని విరాళాలు… కాంగ్రెస్ పార్టీకే లేవని… టీఆర్ఎస్కు ఎక్కడ నుంచి వచ్చాయన్న ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంది.