గ్రేటర్ఎన్నికల ప్రచారం మాత్రమే కాదు, ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి అవసరమైన వ్యూహ ప్రతివ్యూహాలను సిద్ధం చేయడంతో సహా సమస్త విషయాలను బాధ్యతలను తన భుజస్కంధాలపై వేసుకుని.. ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ ఎంత కష్టపడుతూ ఉన్నారో అందరూ గమనిస్తూనే ఉన్నారు. రాజకీయంగా వ్యూహరచన, విజయం సాధించడం అనే విషయాలలో తర్ఫీదు పొండానికి కేటీఆర్‌కు ఈ గ్రేటర్ ప్లేగ్రౌండ్‌ను పూర్తిస్థాయిలో మరొకరి సాయం (ప్రమేయం) లేకుండా అప్పగించినట్లుగా కనిపిస్తోంది. దానికి తగ్గట్లుగానే తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి కేటీఆర్చాలా శ్రమిస్తున్నారు.
అయితే ఇప్పుడు కేటీఆర్ కష్టం ఒక కొలిక్కి రాబోతున్నది. మరో రెండు రోజుల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఈ సమయంలో గ్రేటర్ విజయం కోసం ఇన్నాళ్లుగా పడుతున్న కష్టానికి గాను పోలింగ్‌కు రెండురోజుల ముందుగానే కేటీఆర్‌కు ఓ భారీ గిఫ్ట్ లభించింది. ఈ గిఫ్ట్ ఇచ్చింది మరెవ్వరో కాదు.. ఆయన తండ్రి కేసీఆర్.
శనివారం సాయంత్రం సికింద్రబాద్‌లో నిర్వహించిన భారీ బహిరంగసభలో ప్రసంగించిన కేసీఆర్.. ప్రసంగంలో భాగంగా.. తనయుడు కేటీఆర్ ఎన్నికల కోసం పడుతున్న కష్టాన్ని అభినందించారు. చాలా కష్టపడి గల్లీగల్లీలోనూ కేటీఆర్ తిరిగి పార్టీని విజయం దరికి చేరుస్తున్నారంటూ పొగిడారు. తెరాసను గెలవబోతున్న నేపథ్యంలో.. నగరం మీద ఇంతగా అవగాహన పెంచుకున్న కేటీఆర్‌కు.. ప్రస్తుతం చూస్తున్న పంచాయతీరాజ్ శాఖతో పాటూ ప్రస్తుతం తన వద్ద ఉన్న మునిసిపల్ శాఖను కూడా అప్పజెప్పబోతున్నట్లుగా కేసీఆర్ సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించేశారు. దీనివల్ల నగరాభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు.
కేటీఆర్‌కు గిఫ్ట్ దొరికింది బాగానే ఉంది. మరి.. అటు కాంగ్రెస్ చేతిలో నిన్నటిదాకా ఉన్న ఎమ్మెల్యేసీటు నారాయణఖేడ్ ను గులాబీ పరం చేయడానికి కష్టపడుత్ను అల్లుడు హరీష్‌రావు సక్సెస్ అయితే మరి ఏం కానుక ఇస్తారో కేసీఆర్ వేచిచూడాలి.