వంద సీట్లకు ఎప్పుడూ తగ్గని కేసీఆర్.. నోట మొదటి సారి.. ఓటమి మాట బయటకు వచ్చింది. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ లో .. ఎన్నికల ప్రచారసభలో.. పాల్గొన్న కేసీఆర్… ఎన్నికల్లో గెలిపిస్తే పని చేస్తామని.. లేకపోతే.. ఇంట్లో పడుకుంటామని ప్రకటించారు. ఓడిపోతే తనకేమీ నష్టం లేదని.. కానీ ప్రజలే నష్టపోతారని హెచ్చరించినట్లుగా ప్రసంగించారు. మిగతా ప్రసంగం సంగతేమో కానీ.. కేసీఆర్ ఎన్నికల్లో ఓటమి గురించి ప్రస్తావించడం.. హాట్ టాపిక్ అయింది. బరాబర్… వంద సీట్లు గెలుస్తాం.. ఎంత మంది ఎన్ని కూటములు కట్టినా… తమకు ఎలా ఇబ్బంది లేదని.. అసలు లెక్కే లేదని.. చాలా రోజులుగా చెప్పుకొస్తున్నారు. కానీ.. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసి.. ప్రచార పర్వం వేడెక్కేసరికి.. కేసీఆర్ మాటల్లో తేడా వచ్చేసింది.
నిజానికి .. కేసీఆర్ నోటి వెంట నేరుగా ఓటమి మాట…మాత్రమే కాదు.. టీఆర్ఎస్ కు నిశ్శబ్ద విప్లవం ఉందన్న భావన కూడా వచ్చింది. మరో ఎన్నికల ప్రచారం… ఇతరులు చెబుతున్నట్లు నిశ్శబ్ద విప్లవం లేదని.. ప్రచారసభలకు వచ్చిన జనాలను చూపిస్తూ.. శబ్ద విప్లవమే ఉందని.. టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉందని.. ఆయన చెప్పుకొచ్చారు. కొద్ది రోజుల నుంచి.. టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతోందన్న ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీని రద్దు చేసినప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు లేదని.. ముఖ్యంగా మహాకూటమి ఏర్పడిన తర్వాత.. ప్రత్యామ్నాయంగా.. ఆ కూటమి ఓటర్లలోకి వెళ్లిందని విశ్లేషణలు చురుగ్గానే వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కేసీఆర్ … నిశ్మబ్ద విప్లవం.. ఓడిపోతే రెస్ట్ తీసుకుంటాననడం… మాత్రం… ఆసక్తికరమే.
కేసీఆర్ మాటల్లో కనిపిస్తున్న మార్పు.. తమకు ఇబ్బందికరం అవుతుందని… తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు వాపోతున్నారు. ప్రతి సభలోనూ.. వందకు వంద సీట్లు అనే కాన్ఫిడెన్స్ ఇప్పుడు తగ్గిపోవడం.. పదే పదే చంద్రబాబును టార్గెట్ చేయడంతో…ఓటమి ఖరారయిందని.. చివరి ప్రయత్నంగా సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు కాంగ్రెస్ వైపు నుంచి వస్తున్నాయి. చంద్రబాబు ఏమీ తెలంగాణకు సీఎం కాలేడని ..ఆయన ఏపీకే పరిమితమని తెలిసి కూడా.. కేసీఆర్.. చంద్రబాబును టార్గెట్ చేసుకుని.. ఓటమి భయంతోనే ఇలా చేస్తున్నారన్న విమర్శలకు కారణమవుతున్నారు. మొత్తానికి.. కేసీఆర్ వ్యూహాత్మకంగా అన్నారో.. మనసులో మాట బయటకు వచ్చిందో కానీ.. ఓటమి ప్రకటనను.. కాంగ్రెస్ నేతలు.. సోషల్ మీడియాలో వైరల్ చేసుకుంటున్నారు.