విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు తొలి అడుగు అని ప్రచారం జరుగుతున్న ఓ బిడ్ లో పాల్గొనాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. సింగరేణి లేదా ఖనిజాభివృద్ధి సంస్ధ ద్వారా బిడ్ వేయించాలని నిర్ణయించుకుంది. విశాఖ ఉక్కు పరిశ్రమ నిర్వహణకు మూలధన సేకరణలో భాగంగా ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరె్స్ట-ఈవోఐ)ను ఆహ్వానించింది. ఈ బిడ్ ప్రకారం… ముడి సరకును సరఫరా చేయాలి… ఉత్పత్తి అయిన ఉక్కును కొనుగోలు చేయాలి. అంతే కానీ పూర్తి స్థాయిలో ప్లాంట్ ను కొనుగోలు చేసినట్లుగా కాదు. కాకపోతే ప్రైవేటీకరణలో ఇది తొలి అడుగు అనిటీ ఆర్ఎస్ వాదిస్తోంది. అందుకే బిడ్లో పాల్గొనాలని నిర్ణయించింది.
. గత నెల 27న ఈవోఐ విడుదల అయింది. ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం వరకు ఆసక్తిగల కంపెనీలు బిడ్లు దాఖలు చేయవచ్చు. ఈవోఐ బిడ్లలో ప్రభుత్వాలు నేరుగా పాల్గొనేందుకు వీల్లేదు. కంపెనీలు మాత్రమే పాల్గొనాలి. అందుకే సింగేరణిని రంగంలోకి దించాలని కేసీఆర భావిస్తున్నారు. అధికారులు స్టీల్ ప్లాంట్ కు వెళ్లి వివరాలు తెలుసుకుని ఆ తర్వాత బిడ్ దాఖలు చేయనున్నారు. నిజానికి ఇంత కాలం సైలెంట్ గా ఉండి చివరి ఐదు రోజులలో హడావుడి చేయాలనుకోవడం రాజకీయమేనని భావిస్తున్నారు. సింగరేణిగి మైనింగ్ అనుభవం ఉంది కానీ ఉక్కు పరిశ్రమతో అసలు సంబంధం ఉండదు. కానీ సింగరేణిలో తెలంగాణ ప్రభుత్వానికి 51 శాతం వాటా ఉంంది.
నిజానికి సింగరేణి సాయంతో బయ్యారంలో ఉక్కుపరిశ్రమ పెడతామని కేసీఆర్, కేటీఆర్ చాలా సార్లు ప్రకటించారు. ఎన్నికల్లో లబ్దికి వాడుకున్నారు. కానీ ఇప్పుడు పట్టించుకోవడం లేదు. ఏపీలో స్టీల్ ఫ్యాక్టరీ కొంటామంటూ బయలుదేరారన్న విమర్శలు వస్తున్నాయి.
అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం తరపున సింగరేణితో బిడ్ వేయిస్తే.. ఏపీ సర్కార్ పై మరింత ఒత్తిడి పెరుగుతుంది. స్టీల్ ప్లాంట్ ను కాపాడతామంటూ పొరుగు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే… ఏపీ ప్రభుత్వం ఎందుకు సైలెంట్ గా ఉంటుందని.. ఏపీ ప్రభుత్వం కూడా బిడ్ లో పాల్గొనవచ్చు కదా అన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరి కేసీఆర్ ముందడుగు వేసిన తరవాతైనా జగన్ మేలుకుంటారో లేదో ?