టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజును ఈ సారి ధూమ్‌ధామ్‌గా చేయాలని కేటీఆర్ నిర్ణయించారు. గత రెండేళ్లుగా కరోనా కారణంగా భారీ కార్యక్రమాలేమీ పెట్ుటకోలేదు. కానీ ఈ సారి మాత్రం మూడు రోజుల పాటు ఘనంగా చేయాలని పార్టీ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేసారు. తెలంగాణ రాష్ట్ర ప్రదాత కేసీఆర్ కాబట్టి 15,16,17 తేదీల్లో దానికి తగ్గట్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఎవరికి తోచిన మేరకు వారు తమ సేవా దృక్పథాన్ని చాటుకునేల ఈ సంబరాలు ఉండాలని కేటీఆర్ అన్నారు.
ఈ మూడు రోజులపాటు పార్టీ శ్రేణులు నిర్వహించాల్సిన కార్యక్రమాల వివరాలును కూడా టీఆర్ఎస్ ప్రకటించంింది. ఈనెల 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాలి. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, అనాధాశ్రమాల వంటి చోట్ల పండ్ల పంపిణీ, ఆహార పంపిణీ, దుస్తుల పంపిణీ వంటి కార్యక్రమాలను పార్టీ నేతలు చేపట్టాలి. ఇక 16 తేదీ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. 17 తేదీ కెసిఆర్ గారి జన్మదినం రోజున రాష్ట్ర వ్యాప్తంగా సర్వమత ప్రార్థనలు, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు చేపట్టాలనికేటీార్ సూచించారు.
ఈ మూడు రోజులపాటు ఇవే కాకుండా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతి కార్యకర్త తనకు తోచిన విధంగా ఇతరులకు సహాయ పడేందుకు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా తమ తమ స్థాయిలో ఏ సేవా కార్యక్రమాన్ని అయినా చేపట్టవచ్చని కేటీఆర్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. పార్టీ పరంగా మూడు రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చినప్పటికీ అవన్నీ ధూం..ధాం.. గా రాజకీయ కార్యక్రమాలుగా జరుగుతాయనడంలో సందేహం లేదు.