తెలంగాణ సీఎం కసీఆర్ కింది స్థాయి క్యాడర్ ను కాపాడుకునేందుకు.. వారిలో నమ్మకం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. బెడ్ రెస్ట్ లో ఉన్న ఆయన ద్వితీయ శ్రేణమి నేతలుక ఫోన్లు చేసి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. దాదాపుగా అరవై నియోజకవర్గాల నేతలతో ఇప్పటికే కేసీఆర్ మాట్లాడారని అంటున్నారు. తెలంగామ అభివృద్ధి కోసం పూర్తి సమయం వెచ్చించానని.. పార్టీని క్యాడర్ ను పట్టించుకోలేదని.. తప్పులు జరిగాయని.. దిద్దుకుందామని ఆయన చెబుతున్నట్లుగా తెలుస్తోంది.
కేసీఆర్ వారి అభిప్రాయాలను స్వేచ్చంగా చెప్పేందుకు అవకాశం కల్పిస్తున్నారు. వారు తాము పడిన ఇబ్బందులను కేసీఆర్ దృష్టికి తీసుకొస్తున్నారు. అధికార పార్టీలో ఉన్నామన్న పేరే కానీ.. తమను పట్టించుకున్న వారే లేరని ఎక్కువ మంది చెప్పినట్లుగా తెలుస్తోంది. మొత్తం ఎమ్మెల్యేలు, ఇంచార్జుల గుప్పిట్లో ఉండేదని.. ఆయన ఆశీస్సులు లేకపోతే పార్టీ కోసం కష్టపడిన వారికీ కనీస ప్రయోజనం లభించలేదన్నారు. పార్టీ కోసం కాకుండా వారు సొంత గ్రూపుల్ని మెయిన్ టెయిన్ కోసం ప్రయత్నించడంతో… పార్టీకి..క్యాడర్ మధ్య బంధం తెగిందని ఎక్కువ మంది చెప్పారు.
అన్ని స్థాయిల్లోనూ పార్టీని ప్రక్షాళన చేస్తున్నామని.. ఈ సారి అలాంటి పరిస్థితి ఉండదని కేసీఆర్ బుజ్జగిస్తున్నారు. గ్రామ, మండల, జిల్లాస్తాయిలో పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ సారి పార్టీ సెంట్రిక్ గా రాజకీయాలు జరుగుతాయని భ రోసా ఇస్తున్నారు. పార్టీకి భవిష్యత్ ఉండదేమోనని భయపడుతున్న క్యాడర్ లో ధైర్యం నింపేందుకు కేసీఆర్ ఈ ప్రయత్నం చేస్తున్నారని.. ఫిబ్రవరి నుంచి ఆయన అందరికీ అందుబాటులో ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.