తెలంగాణ కొత్త సెక్రటేరియట్ పనులు అనుకున్నంత వేగంగా సాగడం లేదు. దసరాకు ఎలాగైనా ప్రారంభిచాలనుకుంటున్నా సాధ్యం కావడం లేదు. అయితే ఆ రోజు ముఖ్యమంత్రి ఛాంబర్ ను మాత్రం ప్రారంభించనున్నట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ కు ఆరు లక్కీ నెంబర్. ఆయన కార్లన్నింటిపై అదే నెంబర్ ఉంటుంది. తెలంగాణ సెక్రటేరియట్లోనూ ఆరో నెంబర్ ఫ్లోర్ లో సీఎం చాంబర్ ఉంటుంది. కొత్త భవనాన్ని 20 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 9 లక్షల చదరపు అడుగుల్లో సమీకృత సచివాలయ నిర్మాణం జరుగుతోంది.
భవనం నైరుతి భాగంలో సీఎం ఛాంబర్ ఉంటుంది. ఆ ఫ్లోర్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. సీఎం ఫ్లోర్ ను దసరాకు.. మిగిలిన అన్ని ప్లోర్లను సంక్రాంతి వరకు పూర్తి చేసి ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నారు. అన్నిశాఖలను ఒకేసారి నూతన సచివాలయానికి తరలించేలా మొదట ప్లాన్ చేశారు. కానీ, భవన నిర్మాణం పూర్తి కాకపోవడం, దసరా తర్వాత మంచి రోజులు లేకపోవడంతో సీఎం ఆఫీసు ఉండే సిక్స్ ఫ్లోర్‌ను ప్రారంభిస్తే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని, అంతా శుభం కలుగుతుందని కేసీఆర్ భావింంచారు.
మొదటి నుంచి కేసీఆర్‌కు.. దేవుడిపై విశ్వాసం ఉండటంతో సిద్ధాంతులు చెప్పిన ప్రకారమే ముందుకు సాగుతారనే ప్రచారం ఉంది. దీంతో వారి సూచన మేరకే మొదటగా సీఎం ఉండే సిక్స్ ఫ్లోర్‌ను ప్రారంభించనున్నట్లుగా తెలుస్తోంది. కేసీఆర్‌కు అనేక నమ్మకాలు ఉంటాయి.. ఆ ప్రకారం.. సచివలాయం ప్రారంభం తర్వాత కీలక నిర్ణయాలు తీసుకోవాలని అనుంటున్నట్లుగా తెలుస్తోంది.