టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై… కొద్ది రోజులుగా… కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్తో టీడీపీ పొత్తు పెట్టుకోవడాన్ని.. ఓ పెద్ద నేరంగా చెబుతున్నారు. కానీ.. వాస్తవానికి టీడీపీ, టీఆర్ఎస్ మధ్య పొత్తు చర్చలు గతంలో జరిగాయి. ఈ కారణంగానే.. రేవంత్ రెడ్డి.. టీడీపీకి గుడ్ బై చెప్పి.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీడీపీలో కేసీఆర్ ఎజెంట్లు ఉన్నారన్న ఆరోపణలు కూడా చేశారు. ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. టీడీపీతో పొత్తు విషయంలో కేసీఆర్ వెనుకడుగు వేశారు. ఒంటరి పోటీకే మొగ్గు చూపారు. ఈ మధ్యలో ఏం జరిగిందన్నది ఆసక్తికరంగా మారింది. ఇంత వరకూ ఎవరూ బయపెట్టలేదు కానీ.. టీడీపీ అధినేత చంద్రబాబే.. ఎంపీలతో జరిగిన సమావేశంలో..తనకు, కేసీఆర్కు మధ్య జరగిన వ్యవహారాల్ని వివరించారు.
కొన్నాళ్ల కిందట.. చంద్రబాబు … తెలంగాణలో టీడీపీ, టీఆర్ఎస్ కలసి పోటీ చేద్దామనే ప్రతిపాదనను కేసీఆర్ వద్ద ఉంచారట. దానికి కొన్ని లెక్కలు కూడా చెప్పారు. కాంగ్రెస్ ఉంటే కర్ణాటకలో ఉంటుంది.తమిళనాడులో కాంగ్రెస్, బీజేపీలకు చోటు లేదు. దక్షిణభారతంలో తెలుగు రాష్ట్రాలదే పైచేయి అవుతుందని కేసీఆర్తో చెప్పాలన్నారు. అప్పుడు కేసీఆర్ ఆలోచించి చెబుతానన్నారు. వారం రోజుల తరువాత కుదరదని అన్నారన్నారు. తెలంగాణలో టీడీపీ ఒంటరిగా పోటీ చేయాలని… కాంగ్రెస్తో పొత్తు వద్దని ఒత్తిడి చేయించినట్లు చంద్రబాబు వివరించారు. అప్పుడే కేసీఆర్ వేరేవాళ్ల చేతుల్లోకి వెళ్లాడని అర్ధం అయ్యిందన్నారు. అక్కడ జగన్,ఇక్కడ టిఆర్ఎస్ వస్తుందని 2014ఎన్నికల ముందే కెసిఆర్ చెప్పాడు. ఏపిలో జగన్ వస్తే అతని ముందు తానే సమర్ధుడిగా చలామణి కావచ్చని ఆశించారు కానీ ఏపి ప్రజలు కెసిఆర్ ఆశలను తారుమారుచేశారని గుర్తు చేశారు.
సంక్షోభంలోనే సమర్ధ నాయకత్వం బైటకు వస్తుంది. సంక్షోభాన్ని సమర్ధతతోనే ఎదుర్కోగలం. పిరికివాళ్లు సంక్షోభాల్లో మునిగిపోతారు. నా జీవితంలో ఒకటి,రెండుకాదు అనేక సంక్షోభాలు చూశాను. సంక్షోభాలే అనేక అవకాశాలను కల్పిస్తాయన్నారు. మొత్తానికి చంద్రబాబు..కేసీఆర్ మధ్య పొత్తు చర్చలు అయితే నడిచాయి. చివరికి.. కేసీఆర్ ఏం ఆలోచించారో… కానీ.. టీడీపీతో వద్దనుకున్నారు. దానికి తెర వెనుక ఏం జరిగిందనేది కీలకంగా మారింది.. !