మూడో కూటమి టార్గెట్‌గా కేసీఆర్ చెన్నై పర్యటనకు వెళ్లారని టీఆర్ఎస్ కీలక నేత, ఇలా టీఆర్ఎస్ తరపున ఇతర రాష్ట్రాల వ్యవహారాలను చక్కబెట్టే మాజీ ఎంపీ వినోద్ కుమార్ ప్రకటించారు. టూర్ అయిపోయింది.. ఇప్పుడు డీఎంకే లో ఇలా జాతీయ వ్యవహారాలను చక్కబెట్టే ఎంపీ టీఆర్ బాలు ఓ స్టేట్ మెంట్ ఇచ్చారు. అందులో ఎక్కడా కేసీఆర్ ప్రస్తావన రాలేదు కానీ… మూడో కూటమి అనే భావనతో ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీయవద్దని ఆయన మమతా బెనర్జీని కోరారు.
మూడో కూటమి మమతా బెనర్జీ నేతృత్వంలో ఉంటుందని.. కాంగ్రెస్ పార్టీ స్థానాన్ని ఆమె ఆక్రమిస్తుందని.. ఇటీవల చెబుతూ వస్తున్నారు. మమతా బెనర్జీ వెనుక ప్రశాంత్ కిషోర్ ఉన్నరు. ప్రశాంత్ కిషోర్ ఇటీవల టీఆర్ఎస్తో సన్నిహితంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన వ్యూహంలో భాగంగానే చెన్నై వెళ్లారన్న ప్రచారం కూడా ఉంది. ఇప్పుడు మూడో కూటమికి వ్యతిరేకంగా డీఎంకే నుంచి ప్రకటన వచ్చింది. డీఎంకే ప్రస్తుతం యూపీఏలో ఉంది. కాంగ్రెస్ పార్టీకి గట్టి..నమ్మకమైన మిత్రపక్షంగా ఉంది. ఆ పార్టీ నుంచి కాంగ్రెస్ నుంచి దూరం చేసే లక్ష్యంతో కేసీఆర్ రాజకీయం చేశారన్న అభిప్రాయం కూడా బలంగా ఉంది.
ఇలాంటి సమయంలో డీఎంకే.. విపక్షాల ఐక్యతను దెబ్బతీయవద్దని .. ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ కూటమి నుంచి స్టాలిన్ బయటుక వచ్చే అవకాశం వంద శాతం లేదని తాజా పరిణామాలతో తేలిపోయింది. అయితే కేసీఆర్ స్టాలిన్‌తో కలిసి నడవడం.. అంటే యూపీఏ కూటమిలో చేరడం.. లేకపోతే జాతీయ రాజకీయాలపై సైలెంట్‌గా ఉండటం అనే రెండు ఆప్షన్లు ప్రస్తుతం ఉన్నాయంటున్నాంటున్నారు. ఇప్పుడు యూపీఏ వైపు వెళ్తే కేసీఆర్‌కే నష్టం కాబట్టి.. వీలైనంత వరకూ కేసీఆర్ జాతీయ రాజకీయాల విషయంలో సైలెంట్‌గా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు.