తెలంగాణలో ఊరూవాడా తిరిగి ప్రచారం చేస్తన్న బీజేపీ నేతలు.. ముఖ్యంగా ప్రధాని మోదీ బీఆర్ఎస్తో తమకు ఎలాంటి లోపాయికారీ ఒప్పందాలు లేవని ప్రజలకు చెప్పుకోవాల్సి వస్తోంది. ఇందు కోసం ప్రధాని మోడీ కొత్త తరహా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్డీఏలో చేర్చుకోవాలని కేసీఆర్ తన దగ్గరకు వస్తే తిరస్కరించానని తిట్లు అందుకుంటున్నారని అన్నారు. తర్వాత కూడా కేసీఆర్ ను ఎన్డీఏ దగ్గరకు రానిచ్చే ప్రశ్నే లేదన్నారు. ఇది తన గ్యారంటీ అని ప్రచారసభల్లో చెబుతున్నారు. బీజేపీ రాజకీయంగా తీసుకుందో.. యాధృచ్చితంగా తీసుకుందో.. లేకపోతే ఏదైనా కొత్త ప్రణాళిక ప్రకారం ఆలోచించి నిర్ణయం తీసుకుందో కొన్ని నిర్ణయాల వల్ల బీఆర్ఎస్ తో సన్నిహితం అనే ముద్ర పడింది.
కవితను అరెస్టు చేయకపోవడం దగ్గర్నుంచి రైతు బంధుకు అనుమతులు ఇవ్వడం వరకూ మొత్తం రాజకీయం అటు వైపే నడుస్తోంది. దీంతో బీజేపీ పరిస్థితి రాను రాను దిగజారిపోతూ వస్తోంది. అగ్రనేతలు ప్రచారాలు చేస్తున్నా ఆ ప్రభావం మత్రం తగ్గడం లేదు. అందుకే నమ్మించేందుకు మోదీ కూడా ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో ఐదు నెలల కిందట వరకూ పరిస్థితి వేరుగా ఉండేది. ఐదు నెలల్లో పరిస్థితి మారిపోయింది. బీజేపీ గ్రాఫ్ పడిపోయింది.
ఇప్పుడు ముఖాముఖి పోరు నడుస్తోంది. కనీసం హంగ్ అయినా తెచ్చుకుందామని బీజేపీ ప్లాన్ చేసుకుంటోంది. కానీ ఏదీ వర్కవుట్ అవుతున్న సూచనలు కనిపించడం లేదని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. కానీ బీజేపీ పెద్దలు తాము చేయాల్సిన ప్రయత్నాలు మాత్రం తాము చేస్తున్నారు.