డబుల్ ఇంజిన్ సర్కార్ పేరుతో బీజేపీ చేస్తున్న ప్రచారానికి కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. వారు చెప్పినట్లుగా డుబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిందేనన్నారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం పోయి..బీజేపీయేతర ప్రభుత్వం రావడమే డబుల్ ఇంజిన్ సర్కార్ అని ఆయన విశ్లేషించారు. ఖచ్చితంగా బీజేపీని దింపి తీరుతామని ప్రకటించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసిన వారం తర్వాత కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు. భారీ వర్షాలు పడుతూండటంతో సమీక్ష చేసి.. ఈ అంశంపై మాట్లాడేందుకు ప్రెస్ మీట్ పెట్టారు. వచ్చే మూడు రోజులు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఆ తర్వాత మొత్తం బీజేపీ గురించే మాట్లాడారు.
జాతీయ కార్యవర్గ సమావేశంలో మోడీ మాట్లాడింది ఏమీ లేదన్నారు. మొత్తం దేసాన్ని జాతీయ కార్యవర్గ సమావేశాలు నిరాశపరిచాయన్నారు. తాను మోదీని మొత్తం తొమ్మిది ప్రశ్నలు అడిగితే ఒక్కదానికీ సమాధానం చెప్పలేదున్నారు. తానేమీ కొత్త ప్రశ్నలు అడగలేదని 2014కి ముందు మోదీ అడిగిన ప్రశ్నలనే అడిగానంటున్నారు. మోదీ రూపాయి పతనంపై అప్పటి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రశ్నిస్తున్న వీడియోలను ప్రదర్శించారు. దేశ చరిత్రలోనే అత్యంత అసమర్థ ప్రధాని మోదీ అని మండిపడ్డారు. మోదీ ప్రధానిగా కొంత మంది షావుకార్లకు సేల్స్‌మెన్‌గా పని చేయడం తప్ప చేసిందేమీ లేదన్నారు. రూ. నాలుగు వేలకు దొరికే బొగ్గును ముఫ్పై, నలభై వేలకు కొనమంటున్నారని విమర్శించారు ఇదందా షావుకార్ల కోసమేన్నారు.
బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తే.. న్యాయమూర్తుల్ని బెదిరిస్తూ లేఖలు రాస్తున్నారని మండి పడ్డారు. నుపుర్ శర్మ వ్యాఖ్యలపై తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సెల్యూట్ చేస్తున్నాన్నారు. దేశంలో దర్యాప్తు సంస్థల్ని ఉపయోగించుకుని .. దాడులు చేయించి.. పార్టీ నేతల్ని బీజేపీలో చేర్చుకుంటున్నారని .. అన్యాయం రా,్ట్ర ప్రభుత్వాలను కూర్చేస్తున్నారని మండిపడ్డారు. ముందు సీబీఐ కేసులు ఎదుర్కొని.. ఆ తర్వాత బీజేపీలో చేరి ప్రశాంతంగా ఉన్న అనేక మంది లీడర్ల వీడియోలను కేసీఆర్ ప్రదర్శించారు.
బీజేపీ తీరు వల్లే తెలంగాణ మూడు లక్షల కోట్లు నష్టపోయిందని… చేతకాని బీజేపీ తెలంగాణకు అవసరం లేదన్నారు. పతంగా మాంజాల దగ్గర్నుంచి జాడతీయ జెండాల వరకూ అన్నీ చైనావే ఉంటున్నాయని.. ఇదేనా మేకిన్ ఇండియా అన ిప్రస్నించారు. బ్యాంకు దొంగల్లో బీజేపీ నేతలు భాగస్వాములన్నారు. ఒక్కరిని కూడా వెనక్కి తీసుకు రాలేదన్నారు. విశ్వగురువారు పేరుతో ప్రచారం చేసుకోవడంపైనా సెటైర్లు వేశారు. విశ్వగురువా..? విష గురువా అని ప్రశ్నించారు.
వారం రోజుల ఆలస్యంగా ప్రెస్‌మీట్ పెట్టినా… కేసీఆర్ కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతీ అంశాన్ని ప్రస్తావించారు. అగ్నిపథ్ దగ్గర్నుంచి రైతుల ఆందోళన వరకూ ప్రతి అంశాన్ని ప్రస్తావించి… బీజేపీ సర్కార్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు.