బీఆర్ఎస్ పార్టీని మహారాష్ట్రలోనూ రిజిస్టర్ చేయించామని.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామని. ప్రతి జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగరేస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల్లోనూ బీఆర్ఎస్ను గెలిపించండి.. మీ సమస్యలను పరిష్కరించి చూపిస్తామని తెలంగాణ సరిహద్దు ప్రాంతామైన కందార్ లోహలో జరిగిన బహిరంగసభలో కేసీఆర్ భరోసా ఇచ్చారు. స్థానిక నేతలుకొంతమంది బీఆర్ఎస్లో చేరిక సందర్భంగా బహిరంగసభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్, బీజేపీ పాలనతో మన బతుకులు మారలేదనన్నారు. అమెరికా, చైనా కంటే నాణ్యమైన భూమి మనకు ఉంది. ఏటా 50 వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతోందన్నారు. మహారాష్ట్రలో పుట్టే కృష్ణా, గోదావరి నదులు ఉన్నా రైతులకు ఎందుకు మేలు జరగట్లేదు. మహారాష్ట్రలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. . మహారాష్ట్రలో సాగు, తాగు నీరు అన్నిచోట్లకు అందుబాటులో లేదు. నేను ఒక్కసారి నాందేడ్‌కు వచ్చి వెళ్లేసరికి మహారాష్ట్రలో రైతులకు బడ్జెట్లో నిధులు పెంచారు. నేతలు తలుచుకుంటే దేశంలో ప్రతి ఎకరాకు నీరు ఇవ్వొచ్చన్నాపు, దేశంలో త్వరలోనై రైతుల తుపాను రాబోతుంది.. దాన్నెవరూ ఆపలేరు.. కేసీఆర్‌కు ఇక్కడేం పని అని మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అంటున్నారని.. తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. రైతుబంధు, రైతుబీమా అమలు చేస్తున్నాం. పండించిన ప్రతి పంటను కొనుగోలు చేస్తున్నాం. ఫడ్నవీస్ దళిత బంధు అమలు చేస్తే మహారాష్ట్రకు రానే రానని స్పష్టం చేశారు.
తెలంగాణలో దళితుల కోసం దళితబందు అమలు చేశాం. తెలంగాణ మోడల్లాగా ప్రతి రైతుక ఎకరాకు 10 వేలు ఇవ్వాలి. ఇవన్నీ చేస్తామని దేవేంద్ర ఫడ్నవీస్ హామీ ఇస్తే.. నేను మహారాష్ట్రకు రావడం మానేస్తాను. తెలంగాణ తరహా పథకాలు మహారాష్ట్రలో అమలు చేయనంత వరకు మహారాష్ట్రకు వస్తూనే ఉంటానని ఫడ్నవీస్‌కు స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల నుంచి మాకు విజ్ఞప్తులు వస్తున్నాయి. మా ప్రాంతంలో సభ పెట్టాలని అనేక చోట్ల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. మహారాష్ట్ర అంతటా సమావేశాలు ఏర్పాటు చేస్తామన ిప్రకటించారు. దేశంలో 360 బిలియన్ టన్నుల బొగ్గు ఉంది. దేశంలో ఉన్న బొగ్గుతో 24 గంటల విద్యుత్ సులభంగా ఇవ్వొచ్చు. పీఎం కిసాన్ కింద కేంద్రం కేవలం రూ. 6 వేలు మాత్రమే ఇస్తుంది. పీఎం కిసాన్ కింద రైతులకు కనీసం రూ. 10 వేలు ఇవ్వాలి. మహారాష్ట్రలో ఎకరాకు రూ. 10 వేలు ఇచ్చే వరకు కొట్లాడుతామని భరోసా ఇచ్చారు.