ముఖ్యమంత్రి కేసీఆర్ రాక కోసం శాంతి కళ్యాణం వాయిదా వేసినా చినజీయర్‌కు ఊరట లభించలేదు. శనివారం ఘనంగా నిర్వహించిన శాంతి కల్యాణంకు రావాలని కేసీఆర్‌కు ప్రత్యేకంగా ఆహ్వానం పంపారు. చినజీయర్ మీడియా సమావేశం పెట్టి ప్రత్యేకంగా వివరణ ఇచ్చి కమ్యూనికేషన్ గ్యాప్ తగ్గించుకునే ప్రయత్నం చేశారు. కానీ కేసీఆర్ ఒక్క సారి ఎవరినైనా పట్టించుకోకూడదు అనుకుంటే పట్టించుకోరు. అందుకే ఆయన శాంతి కల్యాణానికి వెళ్లలేదు. ఆయనే కాదు కుటుంబసభ్యులు కానీ టీఆర్ఎస్ నేతలు కానీ వెళ్లలేదు. యాదాద్రి యాగాన్ని కూడా వాయిదా వేయడంతో ఇక కేసీఆర్ చినజీయర్ విషయంలో గతంలో ఉన్నంత అభిమానంతో ఉండే అవకాశం లేదని భావిస్తున్నారు.
మేడారం వెళ్లాల్సి ఉన్నప్పటికీ కేసీఆర్ వెళ్లలేదు. ముంబై వెళ్లి ఉద్దవ్ ధాకరేతో సమావేశం కావాల్సి ఉంది. ఈ సమావేశానికి సంబంధించి కీలకనేతలు, సలహాదారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షిస్తూ బిజీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. దేశ రాజకీయాల్లో మరో కూటమి ఏర్పాటుకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో కూడా సంప్రదింపులు జరిపే క్రమంలోనే మేడారం వెళ్లలేకపోయారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నారు. కేసీఆర్ వెళ్తోంది రాజకీయ పర్యటనకు ..అధికార పర్యటన కాదు. అయినప్పటికీ కొన్ని రెండు రాష్ట్రాల మధ్య ఉన్న కొన్ని అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది.
ముచ్చింతల్‌లో సమతామూర్తి విగ్రహం కోసం ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయిలో సహకరించినా శిలాఫలకం మీద పేరు లేకుండా చేయడంతో కేసీఆర్‌కు ఆగ్రహం వచ్చిందని తెలుస్తోంది. అందుకే ఆయన ముచ్చింతల్ వైపు చూడలేదని తెలుస్తోంది. మొత్తంగా చినజీయర్ అంటే ఎంతో గౌరవం ఇచ్చే కేసీఆర్ ఓ చిన్న విషయం వల్ల ఆయనను పూర్తిగా దూరం పెట్టే పరిస్థితి ఏర్పడింది.