హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు నిజాం నవాబును మరిపిస్తోందని కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చటానికి డబ్బులు లేవుగానీ ఖరీదైన బస్సుకోసంమాత్రం కోట్లరూపాయలు ఖర్చు పెడుతున్నారని డిగ్గీరాజా ట్వీట్ చేశారు. మరోవైపు ఐదు కోట్ల రూపాయల బస్సుపై కేసీఆర్ నిన్న అసంతృప్తి వ్యక్తం చేశారు. బస్సులో సీటింగ్, ఎలక్ట్రానిక్ సౌండ్ సిస్టమ్ వంటి సదుపాయాలు సరిగా లేవని అధికారులతో అన్నట్లు తెలిసింది. ఇవాళ రంగారెడ్డి, మెదక్, కరీంనగర్ జిల్లాలలోని హరితహారం కార్యక్రమానికి సీఎమ్ ఈ కొత్త బస్సును ఉపయోగించకుండా తన మామూలు కాన్వాయ్‌లోనే వెళ్ళారు. అటు కొత్త బస్సును హయత్‌నగర్‌లోని బెంజ్ కంపెనీ గ్యారేజికి తరలించారు. కేసీఆర్ సూచించిన లోపాలను అక్కడ సరిచేయనున్నట్లు సమాచారం.