పోలింగ్ తేదీ దగ్గర పడే కొద్దీ కేసీఆర్ తన ప్రసంగశైలిలో మార్పులు చేసుకుంటున్నారు. వర్షం పడే సూచనలు కనిపించడంతో సికింద్రాబాద్ సభను రద్దు చేసుకున్న కేసీఆర్ ఒక్క రోజు ఖాళీగా ఉండి మళ్లీ ప్రచారసభల్లో ప్రసంగాలు కొనసాగించారు. అయితే ఆదివారం నాటి సభల్లో కేసీఆర్ ప్రసంగాల్లో మార్పు కనిపించింది. ఆయన ప్రసంగం భావోద్వేగాల వైపు వెళ్లడం ఆసక్తికరంగా మారింది.
తనకు 70 ఏళ్లు వచ్చాయని.. రెండు సార్లు సీఎం అయ్యానని ఇంకే కావాలని ఆయన పదవి కోసమే కేసీఆర్ ప్రజలను ప్రశ్నిస్తున్నారు. తన తాపత్రయం పదవి కోసం కాదని ఆయన చెబుతున్నారు. తనకు ఇంకేం అవసరం లేదని.. తెలంగాణ సాధించిన కీర్తే ఆకాశమంత ఉందన్నారు. దాన్ని మంచిన పదవి ఇంకోటి లేదని.. మీరు మన్నింది ఇచ్చారు కాబట్టి రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేశానన్నారు. నా అంత ఎక్కువ కాలం పని చేసిన తెలుగు ముఖ్యమంత్రి ఎవరు లేరన్నారు.
తాను రాజకీయం చేస్తోంది పదవి కోసం కాదు.. కచ్చితంగా తెలంగాణ వందకు వంద శాతం పేదరికంలేని రాష్ట్రంగా మారాలన్న లక్ష్యం కోసమేనన్నారు. అదే నా పంతం. కేరళ రాష్ట్ర మాదిరిగా వంద శాతం అక్షరాస్యత సాధించాలి. రైతులు హాయిగా గుండె మీద చెయ్యేసుకుని నిద్రపోయి.. బ్రహ్మాండమైన పంటలు పండే తెలంగాణ కావాలి. తెలంగాణలో ప్రతి ఇంచుకు నీళ్లు రావాలి. అందుకే రాజకీయం చేస్తున్నాన్నారు. ఇది ఓ రకంగా ప్రజల్ని ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారని అంటున్నారు.