తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ రెండో సారి విజయం సాధించగానే.. ఆయన తన రేంజ్ ను.. ఢిల్లీ దాకా ఊహించుకుంటున్నారు. ఫలితాల తర్వాత జరిగిన ప్రెస్మీట్… ఏకంగా సుప్రీంకోర్టు పరిధి దగ్గర్నుంచి ఆర్బీఐ దగ్గర ఉన్న నగదు నిల్వల వరకూ..అన్నింటిపైనా అనర్గళంగా చర్చించి పడేశారు. రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తప్పు పట్టి.. అసలు సుప్రీంకోర్టెవరండీ బాబూ అన్నంత పని చేశారు. ఇంత పెద్ద దేశానికి ఒక్క సుప్రీంకోర్టేనా.. అన్న సంశయం కూడ వెలి బుచ్చారు. ఏ దేశానికైనా.. నాలుగైదు సుప్రీంకోర్టులు ఉండవన్న విషయం.. కేసీఆర్ కు తెలియనిది కాదు. ఒక వేళ అలా ఉంటే.. అది సుప్రీంకోర్టు కాబోదు. అయినా సరే.. నిర్ణయం వ్యతిరేకంగా వచ్చింది కాబట్టి సుప్రీంకోర్టుపైనా అసువుగా అభిప్రాయం చెప్పేశారు.
ఈ ఒక్క అంశంతోనే వదిలి పెట్టలేదు. ఢిల్లీ పెత్తనం గురించి మాట్లాడారు. అంత వరకూ బాగానే ఉంది కానీ.. రాజ్యంగంలో ఉన్న ఉమ్మడి జాబితా గురించి కూడా.. ఈసడింపుగా మాట్లాడారు. రాజ్యాగంలో ఉమ్మడి జాబితా ఉండకూడని తేల్చేశారు.
విద్య,వైద్యం, వ్యవసాయం ఢిల్లీ చేతుల్లో ఎందుకని ప్రశ్నించారు. ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానూ వదిలి పెట్టలేదు. రిజర్వ్ బ్యాంక్ దగ్గర నిల్వ నిధులు రూ. 9 లక్షల కోట్లు ఉన్నాయని.. అలాగే..నవరత్నాల కంపెనీల దగ్గర మరో 9లక్షల కోట్లు ఉన్నాయని.. ఇంత నగదును.. ఊరికనే అలా ఉంచడం ఎందుకని.. ప్రశ్నించారు. ఇలా కేసీఆర్… తెలంగాణ ప్రజలు తనకు ఇచ్చిన 88 సీట్లతోనే.. దేశానికి సంబంధించిన అనేక అంశాలపై అనర్గళంగా.. తెలుగు, ఇంగ్లిష్, హిందీల్లో మీడియాకు చెప్పారు. ఈ కబుర్లన్నీంటినీ జాతీయ మీడియా పట్టించుకోలేదు కానీ.. తెలుగు మీడియా ప్రతినిధులు మాత్రం… చిరునవ్వులతో ఆలకించారు.
వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టిపోతున్నాయని.. దేశం మొత్తం గగ్గోలు పెడుతూంటే… జాతీయ రాజకీయాల్లో వేలు పెడతానంటూ.. హడావుడి చేస్తున్న కేసీఆర్ మాటలు వింటూంటే.. ప్రజలకు మరింత ఆందోళన కలగడం సహజమే. అస్తవ్యస్థ ఆర్థిక నిర్వహణతో.. ప్రజల సొమ్ము ఎటు పోతుందే…తెలియని.. బాధ్యతరాహిత్యమైన పాలనకు నిదర్శనంగా మారిన కేసీఆర్.. రాజ్యాంగంలో ఉన్న అంశాలను కూడా… చాలా తేలికగా తీసి పడేస్తున్నారు. మోడీ కాబట్టి వ్యవస్థల్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదే కేసీఆర్ అయితే.. ఈ పాటికి రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేవారని.. ఆయన మాటలు వింటే ఇట్టే అర్థమైపోతుంది.