తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ రెండో సారి అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలిచిన తర్వాత ఆయన జాతీయ రాజకీయాల గురించే మాట్లాడుతున్నారు. మాట కంటే ముందు..” యెస్” అంటూ… దేశంలో 70 ఏళ్లుగా ఉన్న సమస్యలు పాలకులు పరిష్కరించలేకపోయారని.., తాను చిటికెలో చేసేస్తానంటూ చెబుతున్నారు. తనకు క్రేజ్ రావడానికి కావొచ్చు … తమ జాతీయ విధానంలో భాగంగా రైతులందరికీ.. దేశవ్యాప్తంగా “రైతు బంధు” అమలు చేస్తామని ప్రకటించారు. నిజానికి ఈ పథకం తెలంగాణలో ప్రకటించినప్పుడు…. ఆయన అస్సామీ పేపర్ల దగ్గర్నుంచి ఒడియా టీవీ చానల్స్ వరకూ.. ఆయా భాషల్లో వందల కోట్లతో ప్రకటనలు ఇచ్చారు. తెలంగాణలో పథకానికి అస్సామీలో ప్రకటనలు ఎందుకో చాలా మందికి అర్థం కాలేదు.. కానీ.. ఇప్పుడు తెలుస్తోంది.. జాతీయ స్థాయిలో కేసీఆర్ పెట్టబోయే పార్టీకి ఈ “రైతు బంధు” డబ్బుల పంపిణీనే ప్రధాన వనరు. ఇప్పటికే… అసదుద్దీన్ తోడుగా ఉన్నారని.. ఇద్దరం కలిసి జాతీయ రాజకీయాల్లో మార్పులు తెచ్చేందుకు హెలికాఫ్టర్ కూడా రెడీ చేసుకున్నామని చెబుతున్నారు. మరి ముందుగా కేసీఆర్ ఎవర్ని కలుస్తున్నారు…?
గతంలో ఫెడరల్ ఫ్రంట్ పేరుతో… ఆయన హడావుడి చేశారు. కొంత మందిని ఆయన కలిశారు. కొంత మంది ఆయన్ని కలిశారు. ఎవరూ ఖాళీగా లేరు. తను గెలిచిన తర్వాత అనేక మంది జాతీయ పార్టీల నేతలు తనకు ఫోన్ చేశారని.. బలీయమైన శక్తిగా ఎదుగుతామని ప్రకటించారు. కానీ.. పరిస్థితి చూస్తే..అలా కనిపించడం లేదు. మమతా బెనర్జీ అభినందించారని కేసీఆర్ చెప్పుకున్నారు. ఆమెను కలవడానికి హెలికాఫ్టర్‌లో అసదుద్దీన్ ను తీసుకుని మొదటగా కోల్‌కతా వెళ్లగలరా..?. మమతా ఇప్పటికే బీజేపీయేతర ఫ్రంట్‌లో కీలకంగా ఉన్నారు. జనవరిలోవిపక్షాల ర్యాలీ కూడా నిర్వహిస్తున్నారు. దానికి కేసీఆర్‌ను ఆహ్వానించలేదు. మరి కేసీఆర్ వస్తానంటే.. ఆమె ఎలా ఆహ్వానం పలుకుతారు..? ఫ్రంట్ పెట్టే మాట సరే.. అసలు కలవడం కూడా… “అంత వీజీ కాదు..”
కశ్మీర్లో పీడీపీతో కలుస్తారా..? కాంగ్రెస్ టీంలో చేరారు … అదంత వీజీ కాదు..!
యూపీలో ఎస్పీ, బీఎస్పీలతో కలుస్తారా..? కాంగ్రెస్లైన్లోకి వెళ్లారు…అదంత వీజీ కాదు..!
బీహార్‌లో నీతీష్ రెడీనా..? ఆయన బీజేపీ మిత్రపక్షం…. అదంత వీజీ కాదు..!
కర్ణాకటలో జేడీఎస్‌ను కలుస్తారా..? కాంగ్రెస్ భాగస్వామి ..అదంత వీజీ కాదు..!
తమిళనాడులో డీఎంకే, మహారాష్ట్రలో ఎన్సీపీ… అసలు వీజీ కాదు..!
కేసీఆర్ కాంగ్రెస్సేతర, బీజేపీయేతర పార్టీల పేరుతో ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారో కానీ.. జాతీయ రాజకీయాల్లో మాత్రం ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చింది. ఆయన గతంలో కలిసిన అజిత్ జోగికి .. చత్తీస్ ఘడ్ ఎన్నికల్లో నాలుగైదు అసెంబ్లీ సీట్లు కూడా రాలేదు. దేశంలో అన్ని పార్టీలు.. ఇప్పుడు.. కాంగ్రెస్‌తోనో.. బీజేపీతోనో.. సెట్ రైట్ చేసుకున్నాయి. ఖాళీగా ఉన్నది.. నవీన్ పట్నాయక్ బీజేడీ, అన్నాడీఎంకే మాత్రమే. నవీన్ పట్నాయక్ ఎప్పుడూ ఢిల్లీ రాజకీయాలకు దూరమే. గతంలో కేసీఆర్ కలుస్తానంటే…కుదరదన్నారు. అన్నాడీఎంకేను కలిసినా ఒక్కటే కలవకపోయినా ఒక్కటే.. అందుకే కేసీఆర్.. హెలికాఫ్టర్ రెడీ చేసుకున్నారు… అసదుద్దీన్ ను తోడుగా ఉంచుంకుంటున్నారు.. మరి ముందుగా ఎవర్ని కలుస్తారు..?.