బీఆర్ఎస్కు అభ్యర్థుల కొరత తీవ్రంగా ఉంది. కేసీఆర్ సమీక్షలు చేసి అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నారు. అయితే ఆ ఆభ్యర్థుల పేర్లను చూసి .. సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు. వారు కనీస పోటీ ఎలా ఇవ్వరగరని సందేహం వ్యక్తం చేస్తున్నారు. మల్కాజిగిరికి శంభీపూర్ రాజు ను ఖరారు చేశారు ఆయన ఎంపీ స్థాయి అభ్యర్థి అని ఎవరూ అనుకోవడం లేదు.
అలాగే జహీరాబాద్ కు గాలి అనిల్ కుమార్ ను.. చేవెళ్లకు కాసాని జ్ఞానేశ్వర్ పేరును ఖరారు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు చోట్ల.. బీఆర్ఎస్కు భారీ లీడ్ వచ్చింది. కానీ ఈ అభ్యర్థుల్ని చూస్తే.. గెలిచేందుకేనా అన్న సందేహం ఎవరికైనా వస్తుంది. కేసీఆర్ కుటుంబసభ్యులు బరిలోకి దిగితే కొన్ని స్థానాల్లో అయినా గట్టిపోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు.. ముఖ్యంగా కవిత ను ఎందుకు పోటీ చేయించడం లేదన్నది ఆశ్చర్యకరంగా మారింది.
కవిత బీఆర్ఎస్ తరపున కాకుండా.. తెలంగాణ జాగృతి తరపన రాజకీయ కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా అసెంబ్లీలో పూలే విగ్రహాం కోసం బీసీ సంఘాలతో కూడా జాగృతి తరపునే సమావేశం నిర్వహించారు. పైగా బీఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. పార్టీ తరపున నిజామాబాద్ లో ఇప్పుడు ప్రచారం చేయడం లేదు. లోక్ సభ ఎన్నికలు వస్తున్నందున అక్కడ నిలబడబోయే అభ్యర్తి కోసం కూడా కసరత్తు చేయడం లేదు
కవితను నిజామాబాద్ లో నిలబెట్టడం రిస్క్ అనుకుంటే మెదక్ లో నిలబెట్టవచ్చు.. కానీ కేసీఆర్ అసలు తన కుటుంబసభ్యల పోటీ వద్దుకున్నారు. కేటీఆర్ మల్కాజిగిరి నుంచి పోటీ చేయాలనుకున్నారు. కేసీఆర్ మెదక్ నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ అన్ని ప్లాన్లను ఉపసంహరించుకున్నారు.