ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి హజరైన మాజీ సీఎం కేసీఆర్… బడ్జెట్ పై స్పందించారు. ఇది రైతు శత్రు ప్రభుత్వంగా కాంగ్రెస్ మార్చేసిందని, ఈ బడ్జెట్ ను అసెంబ్లీలో చీల్చి చెండాడుతామని హెచ్చరించారు.
రైతులకు వెన్నుపోటు పొడిచేలా బడ్జెట్ ఉందని… ఆర్థికమంత్రి వొత్తి వొత్తి మాట్లాడటం తప్పా బడ్జెట్ లో ఏమీ లేదని కేసీఆర్ విమర్శించారు. రైతుబంధు ఎగ్గొట్టేలా ఉన్నారని, వ్యవసాయ స్థిరీకరణతో పాటు ఐటీ పాలసీలే లేవన్నారు.
కొత్త ప్రభుత్వానికి 6 నెలల సమయం ఇవ్వాలని అనుకున్నామని… కానీ పూర్తిగా ఫెయిల్ అయ్యారని కేసీఆర్ ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి ఏ ఒక్క నిర్దిష్ట పాలసీ లేదన్నారు.
ఈ బడ్జెట్ స్టోరీ టెల్లింగ్ లాగ ఉంది తప్పా ఇందులో ఏమీ లేదని కేసీఆర్ విమర్శించారు.
తొలిసారి అసెంబ్లీకి రావటమే కాదు ప్రతిపక్ష నేతగా కేసీఆర్ మీడియా పాయింట్ కు వచ్చి మీడియాతో మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపర్చింది.