తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఏదీ కలసి రావడం లేదు. తెలంగాణలో గత ఏడేళ్ల కాలంలో ఆయన హయాంలో మంచి అభివృద్ధి సాధించిందని నివేదికలు చెబుతున్నాయి. ప్రజలు కూడా నిరంతర విద్యుత్, మిషన్ భ గీరథ వాటర్ .. రైతులకు ప్రాజెక్టులు ఇలా దీర్ఘ కాలిక ప్రయోజనాలు కలిగే ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. కానీ ఆయనపై వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తోందన్న ప్రచారం మాత్రం ఊపందుకుంది. దీన్ని ఎలా డీల్ చేయాలో కేసీఆర్‌కు కూడా అర్థం కానట్లుగా ఉంది. కుల, మత సమీకరణాలు.. ఇతర రాజకీయాలతో కవర్ చేసుకుందామన్నా సాధ్యం కావడం లేదు.
మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని చాలా కాలంగా అనుకుంటున్నారు. కానీ మార్పుచేర్పులు చేస్తే ఏమవుతుందో అన్న ఉద్దేశంతో.. సరైన సమయం రాలేదని ఆగిపోతున్నారు. సంక్రాంతి అయిపోగానే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందనిఅన్నారు. కానీ ఇప్పుడా ఆలోచన ఉన్నట్లుగా స్పష్టత లేదు. ఆగస్టు తర్వాత అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారన్న ఉహాగానాలు వస్తున్నాయి. అదే నిజమైతే కేసీఆర్.. ఇక మంత్రి వర్గాన్ని విస్తరించకపోవచ్చని భావిస్తున్నారు. కానీ పరిస్థితులు బాగో లేవనుకుంటే కేసీఆర్ ముందస్తుకు వెళ్లరని.. అదే జరిగితే.. వచ్చే ఏడాది చివరిలో జరగాల్సిన సమయంలోనే జరుపుతారని… మంత్రివర్గ విస్తరణ చేస్తారని అంటున్నారు.
రాజకీయ వ్యూహ ధురంధురిడిగా పేరొందిన కేసీఆర్ ఇటీవల ఆత్మరక్షణ ధోరణిలో ఉన్నారు. ఆయన వ్యూహాలపై ఆయనకు నమ్మకం సన్నగిల్లుతున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే ఆయన ప్రశాంత్ కిషోర్ టీం సేవలు తీసుకుంటున్నారని భావిస్తున్నారు. ఆయన తన సొంత రాజకీయ నిర్ణయాలు.. కాన్ఫిడెన్స్‌గా తీసుకుంటే పరిస్థితి మెరుగ్గా ఉంటుందని టీఆర్ఎస్ వర్గాలు కూడా భావిస్తున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.