హైద్రాబాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు మద్దతివ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ఈ స్థానంలో గెలిచే అవకాశం బీఆర్ఎస్ కు ఉంది. హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాలో మొత్తం 127 ఓట్లు ఉన్నాయి. ఇందులో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సభ్యులు ఎనిమది మందికి కూడా ఓట్లు ఉన్నాయి. కానీ ఓ బోర్డుకు ప్రస్తుతం సభ్యులు లేరు. బీజేపీ కార్పొరేటర్ దేవర కరుణాకర్ చనిపోయారు. దీంతో మొత్తం ఓటర్ల సంఖ్య 118గా తేలింది. ఇందులో ఎక్స్ ఆఫీషియో ఓటర్లు కూడా ఉన్నారు.
ఇందులో బీజేపీకి 30 వరకూ ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీకి అరవై వరకూ ఉంటాయి. మిగిలినవి మజ్లిస్వి . ఏ విధంగా చూసినా ముగ్గురూ పోటీ చేస్తే బీఆర్ఎస్కే విజయం . బీజేపీ పోటీ చేయకపోయినా… బీఆర్ఎస్కు విజయం దక్కుతుంది. కానీ సీటును మజ్లిస్‌కు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఎంఐఎం, బీఆర్ఎస్ అధికారిక మిత్రపక్షాలు కాకపోయినా రాజకీయంగా పరస్పరం సహకరించుకుంటున్నాయి.
గతంలోలా మద్దతు ఇవ్వాలని ఇటీవల మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కేసీఆర్ ను కలిసి కోరారు. కేసీఆర్ అంగీకరించారు. హైదరాబాద్ నగర మేయర్ స్థానానికి.,. బీఆర్ఎస్ తో సమానంగా సీట్లు కార్పొరేటర్ సీట్లు ఉన్నప్పటికీ మేయర్ స్తానానికి మజ్లిస్ పోటీ చే్యలేదు. అదే సమయంలో రాజకీయంగా రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన మేరకు మద్దతు నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలవడానికి మజ్లిస్ సహకారం ఎంతో అవసరం అని.. కేసీఆర్ గట్టిగా నమ్ముతున్నారు.