నాలుగు నెలల కిందట వరకూ కాంగ్రెస్ పై పెద్దగా ఎవరికీ హోప్స్ ఉండేవి కావు. ఇది నిజం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ కు ఓటు వేయవద్దు… రిస్క్ తీసుకోవద్దు అని కేసీఆర్ , కేటీఆర్, కవిత, హరీష్ రావు ఊరూవాడా తిరిగి చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ? . కాంగ్రెస్ అంత ఈజీగా ఎలా బలపడింది ?. ఇది చాలా మందికి వచ్చే సందేహం. దీనికి ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే తన కొత్తపలుకులో లాజికల్ గా సమాధానం ఇచ్చారు. కేవలం.. కేవలం కేసీఆర్ వల్లనే కాంగ్రెస్ బలపడింది. కేసీఆర్ అహంకారం వల్లనే కాంగ్రెస్ బలపడిందని తేల్చేశారు.
తెలంగాణ ప్రజలు ఆకలితో అయినా ఉంటారు కానీ ఆత్మగౌరవం దెబ్బకొడితే మాత్రం సహించబోరని తగిన బుద్ది చెబుతారని ఆర్కే తేల్చేశారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ దెబ్బకొట్టారని ఆర్కే విశ్లేషణ. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరిగిందని చెబుతున్నారు. ప్రజలు ఇచ్చిన అధికారంతో రాజులాగా వ్యవహరించడం.. ఎవరికీ యాక్సెస్ లేకపోవడం .. కుటుంబం అవినీతికి పాల్పడికే కాపాడుకోవడానికి బీజేపీతో రాజీపడటం… . అప్రజాస్వామ్యంగా ప్రశ్నించే వాళ్లను అణిచి వేయడం వంటివి ప్రజల్ని అసంతృప్తికి గురి చేశాయని ఆర్కే వాదన. ఆర్కే చెప్పిన లాజిక్ ప్రకారం కాంగ్రెస్ బలపడేలా చేసింది కేసీఆరే. ఇప్పుడా కాంగ్రెస్సే ముచ్చెమటలు పట్టిస్తోంది. ఒక వేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ క్రెడిట్ కేసీఆర్ దేనని చెబుతున్నారు.
ఈ వారం కొత్త పలుకులో ఆర్కే .. తెలంగాణ ఎన్నికల్లో ధన ప్రవాహానికి కారణం కేసీఆరేఅని తేల్చారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రతి నియోజకవర్గంలో ఎన్నికల ఖర్చును కేసీఆరే భరిస్తున్నారని పరోక్షంగా చెబుతున్నారు. ఆరు నియోజకవర్గాల్లో ఈ ఖర్చు వంద కోట్లు దాటిపోతోందని ఆర్కే విశ్లేషణ. సీఎంగా పని చేస్తే ఇన్ని వేల కోట్లు ఎలా పంపిణీ చేయగలరనేది ఆర్కేకి వచ్చిన సందేహం. చివరికి ఆర్కే ఓ సలహా ఇచ్చారు. ఇప్పటికైనా కేసీఆర్ తెలుసుకోవాలన్నారు. అయితే ఇప్పుడు తెలుసుకునే సమయం మించిపోయింది. మూడు రోజుల్లో ఓటింగ్ ఉంటే.. కేసీఆర్ ఏం చేయాలన్నది ఆర్కే చెప్పలేదు.
ఏపీలో పరిస్థితులపైనా ఆర్కే కామెంట్ చేశారు. తాము జైల్లో ఉంచాలనున్న రాజకీయ ప్రత్యర్థులకు బెయిల్ ఇస్తున్నారని కోర్టులపై సజ్జల, పొన్నవోలు చేస్తున్న వ్యాఖ్యలపైనా ఆర్కే స్పందించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్లాన్ పైనా వైసీపీ నేతలు ఏమనుకుంటున్నారో చెప్పారు. కానీ డీప్ గా విశ్లేషణ చేయలేదు. వంద రోజుల్లో ఏపీలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి… తెలంగాణ ఫలితాలు వచ్చాక.. పూర్తిగా ఏపీ మీదనే ఆర్కే పలుకులు దృష్టి పెట్టే అవకాశం ఉంది. .