తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదంలో తెలంగాణ సీఎం కేసీఆర్ విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు. కృష్ణా జలాలపై పూర్తిస్థాయిలో పట్టు సాధించేందుకు ఆయన వ్యూహం సిద్ధం చేసుకున్నారు. ఇందు కోసం ఆయన కొత్త వాదన తెరపైకి తీసుకు వచ్చారు. కృష్ణా జలాల్లో చెరిసగం అని ఆయన వాదిస్తున్నారు. రాయలసీమకు … శ్రీశైలం నీటినిపంపిణీ చేస్తున్న పోతిరెడ్డి పాడు ప్రాజెక్ట్ అక్రమం అని ఆయన తేల్చేస్తున్నారు. ఇందులోభాగం అంటూ నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల కూడా అక్రమమేనని.. ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని అంటున్నారు. ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి మరీ ఇలాంటి వ్యాఖ్యలు కేసీఆర్ చేయడంతో.. నీళ్ల విషయంలో భవిష్యత్లో తెలంగాణ వ్యూహం ఎలా ఉండబోతోందో తెలిసిపోతుందని అంచనా వేస్తున్నారు.
విభజన సమయంలో.. తెలుగు రాష్ట్రాల మధ్య ఓ తాత్కలిక ఒప్పందం జరిగింది. దాని ప్రకారం ఏపీ, తెలంగాణ మధ్య 66:34 నిష్పత్తిలో నీటిని పంపిణీ చేస్తారు. అందుకే.. ఇప్పటి వరకూ డ్యాముల్లో ఉన్న నీటిలో అత్యధికం ఏపీకే కేటాయిస్తున్నారు. ఇప్పుడు.. ఈ ఒప్పందం నుంచి బయటికి రావాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది నుంచి రెండు రాష్ట్రాల మధ్య సమానంగా నీటి పంపకాలు జరగాల్సిందేనని ఆయన అంటున్నారు. మొత్తంగా కృష్ణా నికర జలాలు అయిన 811 టీఎంసీల్లో చెరో 405.5 టీఎంసీలను వాడుకోవాల్సిందేనని అంటున్నారు. కేసీఆర్ వాదన ఇప్పుడు సమస్యను మరింత జఠిలం చేసే అవకాశం కనిపిస్తోంది.
ఎగువ రాష్ట్రాలుఎక్కడికక్కడ అడ్డుకట్టలు వేయడంతో కృష్ణాకు నిల్వ చేసుకోలేనంత భారీ వరద వస్తేనే దిగువకు వదులుతున్నారు. ఈ కారణంగా కృష్ణా పరివాహకంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో రాయలసీమకు… కృష్ణా నీరు మాత్రమే తాగు, సాగునీటి అవసరాలకు ఉపయోగపడుతోంది. కృష్ణా డెల్టా అవసరాలను పట్టిసీమ ద్వారా తీర్చి.. ఆ మిగిలిన నీటిని శ్రీశైలం ద్వారా.. సీమకు తరలించాలని.. గత ప్రభుత్వం నిర్ణయించింది. అప్పడు యధావిధిగా పంపిణీ చేశారు కూడా. కానీ ఇప్పుడు సమస్యలు వచ్చాయి. అసలు పోతిరెడ్డిపాడుకే.. కేసీఆర్ టెండర్ పెడుతున్నారు. ఆయన పట్టుదల గురించి తెలుసు కాబట్టి.. ఇప్పుడు రాయలసీమ రైతుల్లో ఆందోళన ప్రారంభమయింది.
రాయలసీమను రతనాల సీమ చేస్తామనిచెప్పిన కేసీఆర్ ఇప్పుడు చుక్క నీరు అందకుండా చేయడానికి సిద్ధమయ్యే విధంగా రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. పరిస్థితుల్ని సమన్వయం చేసుకోవడంలో జగన్ విఫలం కావడం.. మిత్రులతో కూడా.. సఖ్యతగా ఉండలేకపోవడంతో… రాయలసీమకు జల గండం పొంచి ఉందన్న అభిప్రాయం