మూసీపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కేటీఆర్. ఈ సందర్భంగా కేటీఆర్ ఫోటోను బీఆర్ఎస్ లోగోలో పెట్టారు. ఉండాల్సిన కేసీఆర్ ఫోటోను తీసేసేశారు. ఈ కంపేరిజన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. పార్టీని పూర్తిగా కేటీఆర్ టేకోవర్ చేసుకున్నారన్న సంకేతాలను పంపుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ లోగో లో కేసీఆర్ కనిపించేవారు. ఆయన స్థానంలో కేటీఆర్ ఫోటో కనిపిస్తోంది.
గతంలో అసెంబ్లీకి టైగర్ వస్తుందని కేసీఆర్ గురించి చెప్పేవారు. ఇప్పుడు అసలు కేసీఆర్ ప్రస్తావన కేటీఆర్ చేయడం లేదు. మూసీ వ్యవహారంలో గ్రేటర్ ఎమ్మెల్యేలతో కేటీఆర్ సమావేశమయ్యారు. చర్చల్లో కేసీఆర్ వస్తే బాగుంటుందని కొంత మంది ఎమ్మెల్యేలు ప్రస్తావించే ప్రయత్నం చేసినా కేటీఆర్ అసలు ఆ టాపిక్ రానివ్వలేదని చెబుున్నారు. కేసీఆర్ రాజకీయాలకు పూర్తిగా విరామం ప్రకటించారని బీఆర్ఎస్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తూంటే అలాగే కనిపిస్తున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి బయటకు వచ్చారు. ఆ తర్వాత అసలు బయటకు రావడంలేదు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశాలు కూడా పెట్టడం లేదు. జైలు నుంచి వచ్చిన తర్వాత కవిత కూడా సైలెంట్ అయిపోయారు. బతుకమ్మకూ బయటకు రాలేదు. అంటే పూర్తిగా కేటీఆర్ కే పార్టీ అప్పగించేశారని అందుకే ఇక కేసీఆర్ నూ పక్కన పెట్టేస్తున్నరన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.