తెలంగాణ ఉద్యమం ఊపు అందుకున్న తర్వాత టీఆర్ఎస్లో చేరికలకు అంతే లేదు. తెలంగాణ భవన్ కిటకిటలాడేది. ఆ పరిస్థితి బీఆర్ఎస్గా పేరు మార్చుకునే వరకూ సాగింది. ఇప్పుడు అలా చేసిన వారంతా కట్టలు తెగినట్లుగా బయటకు పారిపోతున్నారు. వేరే పార్టీలో చోటు దొరికితే చాలనుకుంటున్నారు. దిగువస్థాయి క్యాడర్ నుంచి మంత్రులుగా పని చేసిన వారి వరకూ అదే పరిస్థితి. వీరిని బుజ్జగించడానికి.. ఆపడానికి కూడా కేసీఆర్, కేటీఆర్ కు శక్తి చాలడం లేదు. తాము చెప్పినా వినే పరిస్థితిలేదని… బుజ్జగించే ప్రయత్నం చేసి తమ విలువను తగ్గించుకోవడం ఎందుుకన్నట్లుగా వీరిద్దరూ వ్యవహరిస్తున్నారు.
కేసీఆర్ ను ప్రజలు వద్దనుకోలేదని.. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై మాత్రమే అసంతృప్తి ఉందని…. తాము నమ్మినట్లుగా కనిపించడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ ఎ న్నికల్లో కేసీఆర్ గెలవాలని, తమ ఎమ్మెల్యేలు మాత్రం ఓడిపోవాలని ప్రజలు కోరుకున్నారని చెబుతున్నారు ఇప్పటికీ అదే చెబుతున్నారు. ఓడిపోయిన ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఇప్పటికీ తగ్గలేదని తాజాగా కేసీఆర్ కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ సమావేశాల సందర్భంగా వ్యాఖ్యానించారు.
లీడర్లు పోయినా క్యాడర్ ను కాపాడుకోవాలని కేసీఆర్ పార్టీ నేతలకు చెబుతున్నారు. అధికారంలో లేకపోవడంతో కొందరు నేతలు అటూఇటూ పోవచ్చు. క్యాడర్ మాత్రం అలాగే ఉంటుంది. ఆ క్యాడర్ను కాపాడుకోవాలని సమీక్షల్లో చెబుతున్నారు. కానీ ద్వితీయ శ్రేణి క్యాడర్ వలసే ఎక్కువగా ఉంది. బీఆర్ఎస్ పార్టీని స్వతహాగా బలపర్చుకునే ప్రయత్నం చేయకపోగా.. అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన విధానం వల్ల.. ఎక్కువ మంది ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండలేని పరిస్థితికి వెళ్లిపోయారు