ఢిల్లీలో అగ్గిపుట్టిస్తామన్న కేసీఆర్ గల్లీ దాటి వెళ్లడం లేదు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ధర్నాలు చేసినప్పటికీ మళ్లీ గల్లీలోనే ధర్నా చేయాలని నిర్ణయించారు. ఈ సారి ధర్నాకు మహాధర్నా అని పేరు పెట్టి ఇందిరా పార్క్ వద్దే చేయాలని నిర్ణయించారు. గురువారం ఇందిరాపార్క్ వద్ద కేసీఆర్ సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వంటి ముఖ్య నేతలందరితో కలిసి పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు ధర్నా చేసి ఆ తర్వాత గవర్నర్కు వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించారు.
వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం క్లారిటీ ఇవ్వడం లేదని.. తక్షణం యాసంగిలో పండే ధాన్యాన్ని ఎంత కొంటారో స్పష్టత ఇవ్వాలనిలేఖ రాస్తారనన్నారు. కేంద్రం నుంచి స్పష్టత రాకపోతే ఢిల్లీలో అయినా.. పార్లమెంట్లో అయినా కొట్లాడతామని..వెనక్కి తగ్గబోమని ప్రకటించారు. పంజాబ్లో పండిన పంటను మొత్తం కొనుగోలు చేస్తున్న కేంద్రం తెలంగాణలో ఎందుకు కొనదని ఆయన ప్రశ్నించారు. వరి ధాన్యం విషయంలో బీజేపీ పై పోరాటానికి కార్యాచరణ ప్రకటించేందుకు కేసీఆర్ ప్రత్యేకంగా సీఎల్పీ భేటీ నిర్వహించారు.
బండి సంజయ్ , బీజేపీ నేతలకు రైతులు నిరసన తెలియచేస్తూంటే దాడులు చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. హబీజేపీ నేతలు రైతులను కన్ఫ్యూజన్ చేయొద్దు.. రైతులను ఆగం చేయొద్దని హెచ్చరించారు. సమైక్య పాలకుల కారణంగా ఆగమైన రైతులను కాపాడుకుంటున్నామని కేసీఆర్ గుర్తు చేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి తీరుతామని ప్రకటించారు.