రాజకీయ ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకోవాలంటే ఎప్పుడూ కేసులు… ఇతర కక్ష సాధింపులతోనే కాదు.. అప్పుడప్పుడూ అభిమానం చూపించడం ద్వారా టార్గెటెడ్ నేతను ఇరుకున పెట్టొచ్చు. ఇలాంటి రాజకీయ వ్యూహాల్ని అమలు చేయడంలో కేసీఆర్ చాలా పకడ్బందీగా ఉంటారు. తాజాగా అసెంబ్లీలో ఆయన ఈటల రాజేందర్‌కు తన మార్క్ రాజకీయం రుచి చూపించారు. తన ప్రసంగంలో చాలా సార్లు ఈటల రాజేందర్, రాజేందరన్న అంటూ పేరు ప్రస్తావించారు.. ప్రతీ సారి పాజిటివ్ టోన్ లోనే మాట్లాడారు. ఈటల రాజేందర్ అడిగారని తాము వ్యతిరేకించబోమని … ఆయన అడిగినవి చేస్తామని చెప్పారు.
ఈటెల రాజేందర్ చెప్పారు కాబట్టి చేయం అని అనొద్దు… కావాలంటే ఈటెల రాజేందర్ కు ఫోన్ చేసి సలహాలు తీసుకుంటామన్నారు. డైట్ చార్జీలు పెంచాలని ఈటెల రాజేందర్ కోరిక మేరకు పెంచుతున్నామని ప్రకటించారు. మాపై ఎన్ని కేసులు, ఎన్ని కుట్రలు చేశారో అందరికి తెలుసని.. ఈటెల రాజేందర్ ఇవ్వాళ ఇక్కడి నుంచి అక్కడి వెళ్లొచ్చు కానీ తెలుసని చెప్పుకొచ్చారు. ఈటెల రాజేందర్ మాట్లాడుతున్న సమయంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. సమస్యలు రెండుసార్లు చెప్పకుండా కంటిన్యూగా చెప్పాలని ..ఈటెల రాజేందర్ లేవనెత్తిన సమస్యలను నోట్ చేసుకోవాలని హరీష్ రావు కు సీఎం సూచించారు.
నిజానికి బీఆర్ఎస్ నుంచి ఈటల వెళ్లలేదు… బలవంతంగా పంపించేశారని అందరికీ తెలుసు. ఆయన భూములు.. ఆస్తులపై దాడులు కూడా జరిగాయి. ఆ తర్వాత హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ఆయనను ఓడించడానికి ఏకంగా దళిత బంధు లాంటి పథకాన్నే ప్రవేశ పెట్టారు.. కానీసాధ్యం కాదు. ఆ తర్వాత ఈటల రాజేందర్ ను అసెంబ్లీలో చూడటం ఇష్టం లేక సస్పెండ్ చేయించారని కూడా చెప్పుకున్నారు.కానీ ఇటీవల మారిన రాజకీయ పరిస్థితుల్లో ఈటల రాజేందర్ ను మళ్లీ టీఆర్ఎస్లోకి ఆహ్వానించారన్న ప్రచారం జరిగింది. మళ్లీ బీఆర్ఎస్ పార్టీలో చేరడం కన్నా చనిపోవడం మంచిదని ఈటల అంతే ఘాటుగా స్పందించారు.