పోలవరం కట్టడం వల్ల భద్రాచలం మునిగిపోతుందని.. వెంటనే ఆ ప్రాజెక్టును నిలిపివేసి.. ముంపును అంచనా వేయాలని… తెలంగాణ సర్కార్ కోర్టుల్లో పోరాడుతోంది. దీన్ని తెలిసుకున్న.. టీడీపీ అధినేత.. అసలు భద్రాచలం మాదే… మాకిచ్చేండి.. అని ఎన్నికల ప్రచారంలో హోరెత్తించారు. అయితే.. ఇప్పుడు.. టీడీపీ ఓడిపోయినా… భద్రాచలాన్ని ఏపీకి ఇస్తారట. ఈ విషయంపై.. గవర్నర్, జగన్ మధ్య చర్చలు జరిగాయని చెబుతున్నారు. ఇది సాధ్యమవుతుందా..?
భద్రచలాన్ని ఏపీలో కలిపేందుకు గవర్నర్ వద్ద చర్చలు..!
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భద్రాచలం గ్రామాన్ని త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయనున్నారనే ప్రచారం జోరందుకుంది. ఏపీలో విలీనం చేసే అంశంపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య చర్చలు కూడా జరుగుతున్న సమచారం వస్తోంది. రాజ్‌భవన్‌లో ఇటీవల ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ సమావేశమైనప్పుడు… ఈ అంశం ప్రస్తావనకు వచ్చిందని తెలుస్తోంది. విభజన చట్టం అంశాలు, రెండు రాష్ట్రాల సమస్యల పరిష్కారంపై చర్చ సందర్భంగా భద్రాద్రి విలీనాంశం కూడా ప్రస్తావనకు వచ్చిందని టాక్ నడుస్తోంది. భద్రాద్రిని ఏపీలో కలిపేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రాథమికంగా సుముఖత వ్యక్తం చేశారని సమాచారం. భద్రాద్రిని ఏపీలో కలపాలంటే పెద్ద ప్రక్రియే ఉంటుంది. రాష్ట్రాల సరిహద్దులు మార్చాలంటే ఇటు రెండు రాష్ట్రాల అసెంబ్లీలూ ఆమోదించాలి. ఆ తీర్మానాన్ని కేంద్రం ఆమోదించాలి. ఆ మేరకు ఏపీ పునర్వవ్యస్థీకరణ చట్టాన్ని సవరిస్తూ పార్లమెంట్లో ఆమోదించాలి. ఆ తర్వాత రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ జారీచేస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఇందుకు సముఖంగా ఉంటే…ఈ తంతంగమంతా పెద్ద కష్టమేమీ కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఏడు మండలాలపై ఇప్పటికీ పోరాటం..! మరి భద్రాచలం ఇస్తారా..?
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి అడ్డంకులు తొలగిస్తూ తెలంగాణ ప్రాంతంలోని ఏడు ముంపు మండలాలను….2014లో ఏపీలో కలిపింది కేంద్రం. ఈ విలీనాన్ని తెలంగాణ ఉద్యమ సంఘాలు, టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పట్లోనే రాములోరున్న భద్రాచలం గ్రామాన్ని ఏపీలో విలీనం చేస్తారని ప్రచారం జరిగింది. కానీ భావోద్వేగాల ప్రాతిపదికన…భద్రాచలం గ్రామాన్ని విలీనం నుంచి మినహాయించారు. మరి ఇప్పుడు తెలంగాణ ఉద్యమసంఘాలు, రాష్ట్రంలోని రాజకీయపార్టీల నేతలు ఎలా స్పందించనున్నారనేది చర్చనీయాంశమవుతోంది. సీఎంలు ఇద్దరూ అంగీకరించి చట్టసభల ఆమోద తీర్మానం పంపిస్తే భద్రాద్రిని ఏపీలో కలిపే ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం సైతం సుముఖంగా ఉండే అవకాశం ఉంది.
భద్రాచలానికి బదులుగా కేసీఆర్ ఏం ఆశిస్తారు..?
ఎనిమిది మండలాలతో కూడిన భద్రాచలం రెవిన్యూ డివిజన్ 1959కి పూర్వం ఆంధ్రలోని తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉండేది. అయితే పరిపాలన, రహదారులు, ప్రాథమిక విద్య, వైద్య సదుపాయాలను మెరుగుపర్చే క్రమంలో భద్రాచలం డివిజన్‌ను తెలంగాణ ప్రాంతంలోని ఖమ్మం జిల్లాలో విలీనం చేశారు. 2014లో రాష్ట్ర విభజన సమయంలో… పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి అనువుగా భద్రాచలం ఊరును తప్ప మిగతా మండలాన్ని ఏపీలో విలీనం చేశారు. రామాలయం సెంటిమెంట్‌తో ఊరు తెలంగాణలో ఉన్నా, చుట్టూ ఉన్న ప్రాంతం ఏపీలో ఉండడంతో…భద్రాచలం వాసులు పాలనాపరంగా ఇబ్బందులు పడుతున్నారు. రాముడి దేవాలయం తెలంగాణ భూభాగంలో రాముని దేవాలయం ఉంటే..గుడిమాన్యాలు ఏపీలో ఉన్నాయనేది మరో వాదన. అయితే కేసీఆర్.. ఉత్తినే… భద్రచలాన్ని ఏపీకి ఎందుకు ఇస్తారని.. అంతకు మించిన ప్రయోజనం..ఏదో అడుగుతారన్న భావన సాధారణ ప్రజల్లో ఉంది. అదేమిటో.. తెలియాల్సి ఉంది.