ఇతర రాష్ట్రాల నుంచి సీనియర్ నతలు వస్తున్నారు. కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరం అని పొగుడుతున్నారు. వెళ్తున్నారు. ఇక టీఆర్ఎస్ నేతల సంగతి చెప్పాల్సిన పని లేదు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారా అని ప్రజలంతా ఎదురు చూస్తున్నారని కోరస్‌గా చెబుతున్నారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షులంతా అర్జంట్‌గా కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిపోవాలని తీర్మానం చేశారు. కేసీఆర్ కూడా ప్రగతి భవన్ వేదికగానే దాదాపుగా కసరత్తు పూర్తి చేశారు. ఇక ప్రకటనే తరువాయి అనుకుంటున్న సమయంలో .. ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.
దసరాకు పార్టీ ప్రకటన ఉంటుందని ఎక్కువ మంది నమ్మారు. కానీ ఎలాంటి పార్టీ ప్రకటన ఉండటం లేదని టీఆర్ఎస్ వర్గాలు ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లో ఏదీ కలసి రాకపోవడంతో పాటు ఇటీవలి కాలంలో దర్యాప్తు సంస్థల దూకుడు ఎక్కువైపోయింది. రాష్ట్రంలో అవినీతిపై ఏదైనా కేసులు పెడితే కక్ష సాధింపు.. తెలంగాణ ఆత్మ గౌరవం పేరుతో ప్రజల్లోకి వెళ్లవచ్చు కానీ… ఢిల్లీ లిక్కర్ కేసుల్లో ఇప్పుడు తెలంగాణ నేతలు ఇరుక్కున్నారు. స్వయంగా కేసీఆర్ పేరు వినిపిస్తోంది. ఓ ఆడిటర్‌పై ఈడీ అధికారులు నిర్వహించిన సోదాల్లో చాలా మంది టీఆర్ఎస్ నేతల హవాలా దందా బయటపడినట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఇక జాతీయ రాజకీయాలలలో ధర్డ్ ఫ్రంట్ అంటూ ఉండదని … ఉండేది కాంగ్రెస్ కూటమేనని కేసీఆర్ ఎన్నో ఆశలు పెట్టుకున్న నితీష్ కుమార్ కూడా క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్‌కు వచ్చి కేసీఆర్ నాయకత్వం కోసం దేశం ఎదురు చూస్తోందని.. ఆయన సేవలు దేశానికి ఎంతో అవసరం అని ప్రకటించిన ఎవరూ ..ఢిల్లీలో ఆయనతో కలిసి నడిచేందుకు ముందుకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఇప్పటికే ఎంత కసరత్తు చేసినా అనుకున్న విధంగా హైప్ రాకపోవడం.. ఇప్పుడు తెలంగాణను వదిలేసి ఢిల్లీ వెళ్తే.. మొదటికే మోసం వస్తుందన్న అంచనాతో కేసీఆర్ .. జాతీయ పార్టీ విషయాన్ని ప్రస్తుతానికి హోల్డ్‌లో ఉంచాలని నిర్ణయం తీసుకున్నట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.