తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణంపై కేసీఆర్ ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. ఆయన సమీక్షల్లో… ఖచ్చితంగా.. సచివాలయం అంశం ఉంటోంది. ప్రస్తుత సచివాలయం ఎదుర్కొన్న సమస్యలేమీ రాకుండా… కొత్త భవనంలో అన్ని సౌకర్యాలు ఉండాలని.. పెరుగుతున్న అవసరాలకు తగ్గట్లుగా…. భవనం ఉండాలనే ఆలోచన చేస్తున్నారు. మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, సలహాదారుల చాంబర్లు సకల సౌకర్యాలతో ఉండాలని… ప్రతి అంతస్తులో డైనింగ్ హాలు, మీటింగ్ హాలు, వెయిటింగ్ హాల్ ఉండాల్సిందేనని చెబుతున్నారు. అలాగే పార్కింగ్ కోసం… ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని.. ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసేలా పరిస్థితి ఉండకూడదని చెబుతున్నారు.
డిజైన్‌పై కేసీఆర్ ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. ఇప్పటికే రెండు, మూడు సార్లు డిజైన్‌పై సమీక్ష నిర్వహించారు. బుధవారం కూడా.. కొత్త భవనానికి సంబంధించిన డిజైన్లను పరిశీలించారు. గత సమీక్షలో సీఎం సూచనల మేరకు మార్పులు చేసిన డిజైన్లను ఆర్కిటెక్ట్ నిపుణులు ఈ సమావేశంలో ఆయన ముందు ఉంచారు. వీటిలో మళ్లీ పలు మార్పులను సీఎం సూచించారు. ఆ మార్పులు చేర్పులు చేసుకుని.. మరోసారి సీఎంకు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు నిపుణులు. వాటిని పరిశీలించి తుది డిజైన్ ఖరారు చేసే అవకాశం ఉంది.
తెలంగాణకు ప్రతిబింబంగా… సచివాలయం నిలవాలనే ఆకాంక్షతో కేసీఆర్ ఉన్నారు. అందుకే… సచివాలయాన్ని ఓ భవనంగా మాత్రమే చూడకుండా… అదో అస్థిత్వంగా భావిస్తున్నారు. అందుకే.. స్వయంగా డిజైన్ల దగ్గర్నుంచి ప్రతీ అంశాన్ని పరిశీలిస్తున్నారు. అత్యంత విశాలంగా.. అన్ని సౌకర్యాలతో… ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం కరోనా ఉన్నప్పటికీ.. దానిపై కంటే.. సచివాలయంపైనే ఎక్కువ శ్రద్ధను కేసీఆర్ పెడుతున్నారంటే… ఆయన ఎంత సీరియస్‌గా ఈ విషయాన్ని తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు.