తెలంగాణ సీఎం కేసీఆర్ పూర్తి స్థాయిలో తెర ముందుకు వస్తున్నారు. ఎన్నికలకు దగ్గర పడుతూండటం. .. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు నోటీసులు.. అరెస్ట్ చేస్తారనే ప్రచారం మధ్య ఈ రోజు మంత్రివర్గ సమావేశాన్ని శుక్రవారం… బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మాములుగా అయితే కేబినెట్ భేటీనే ఖరారు చేశారు. కానీ చివరి క్షణంలో విస్తృత స్థాయి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. గతంలో కేబినెట్ భేటీ, విస్తృత స్థాయి సమావేశం ఒక్క రోజే జరిగింది.
కేబినెట్ భేటీలో పెండింగ్‌లో ఉన్న సంక్షేమ పథకాలకు సబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేసీఆర్ ఈ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలోనూ అమలు చేయలేకపోయారు. ఇవి ఎన్నికల్లో హైలెట్ అయ్యే అవకాశం ఉంది. అందుకే కనీసం ప్రారంభించాలని అనుకుంటున్నారు. అలాగే కేసీఆర్ ఓ సంచలనాత్మక కొత్త పథకం ప్రవేశ పెట్టాలనుకుంటున్నారని అది రైతు పించన్ కావొచ్చంటున్నారు. దానిపైనా చర్చ జరగవచ్చంటున్నారు.
కార్యవర్గ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించి… కవిత అరెస్టు అయితే ఎలాంటి నిరసన కార్యక్రమాలు నిర్వహించాలన్న విషయంపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని యోచిస్తున్నారు. పార్టీ పరంగా కూడా కొన్ని కీలక నిర్ణయాలను కేసీఆర్ తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.
కేసీఆర్ రాజకీయంగా ఇప్పుడు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. గతంలో తన బిడ్డలు అవినీతి చేసినా క్షమించనని ఆయన చెప్పారు.కానీ ఇప్పుడు కుమార్తెనే ఢిల్లీ లిక్కర్ స్కాంలో వేరే రాష్ట్రంలో ఇరుక్కున్నారు. ఈసమస్యను పరిష్కరించడం కేసీఆర్‌కు సవాల్‌గా మారింది.