భారత్ రాష్ట్ర సమితి పేరుతో పార్టీని ఏర్పాటు చేసినా ఒక్క మహారాష్ట్రపై తప్ప మరో రాష్ట్రంపై దృష్టి పెట్టని కేసీఆర్. సంకీర్ణ రాజకీయాలనే నమ్ముకుంటున్నారు. ఏ కూటమిలో లేకపోవడమే పెద్ద అడ్వాంటేజ్ అనుకుంటున్న ఆయన.. కేంద్రంలో చక్రం తిప్పగలిగే స్టేజ్‌కు రావాలని .. అన్ని సీట్లు పొందాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. అందుకు మహారాష్ట్ర సీట్లపైనే గురి పెట్టారు.
తెలంగాణతో పాటు మహారాష్ట్ర రాజకీయాలపైనా కేసీఆర్ ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. అక్కడ్నుంచి చేరికలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ భవన్ లో రోజూ చేరికలు ఉండేవి. అలాంటి తరహాలో వారానికో సారి ఓ బ్యాచ్ లీడర్లు వచ్చి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఈ కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో మహారాష్ట్ర, తెలంగాణల్లో వచ్చే సీట్లతో… కేంద్రం మెడలు వంచుతామని.. మహారాష్ట్రను అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు. అంటే… పార్లమెంట్ లో .. తెలంగాణ లో వచ్చే బలం బీఆర్ఎస్కు సరిపోదని మరింత అదనపు బలం కోసం… మహారాష్ట్రను గురి పెట్టారని రాజకీయవర్గాలు అంచనాకు వచ్చాయి.
మహారాష్ట్రలో కేసీఆర్ సీట్లు సాధిస్తారో లేదో కానీ.. ఆయన మాత్రం… కేంద్రంలో చక్రం తిప్పేందుకు మాస్టర్ ప్లాన్ వేసుకున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కనీసం ముఫ్పై సీట్లు సాధిస్తే… సంకీర్ణం వస్తుందని తాము ఎవరికి మద్దతు ఇస్తే వారే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని.. కాలం కలసి వస్తే తమకే అతి పెద్ద ప్రాంతీయ పార్టీ కూటమి మద్దతు ఇస్తుందని అంచనా వేస్తున్నారు. కేసీఆర్ రాజకీయం మాత్రం.. మొత్తంగా మహారాష్ట్ర కేంద్రంగా మారుతోంది. అక్కడి ప్రజలపైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంటున్నారు.