HCU ఇష్యూను బీఆర్ఎస్ ఇంకా అలాగే పట్టుకొని వేలాడటం అనుమానాస్పదంగా కనిపిస్తోంది. ఈ వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. తీర్పు ఎలా వస్తుందని రాజకీయ వర్గాలతోపాటు పర్యావరణ ప్రేమికులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలో ఉండటంతో ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలు నోరు మెదపడం లేదు. బీఆర్ఎస్ మాత్రం రాజకీయం కొనసాగిస్తోంది. మునుపటి ఫైర్ కొనసాగించకపోయినా HCU అంశంపై మాట్లాడుతూనే ఉండటం చర్చనీయాంశం అవుతోంది. HCU స్టూడెంట్స్ లో కొద్దీ మంది నుంచి మాత్రమే బీఆరెస్ కు మద్దతు వస్తోంది. మెజార్టీగా ఆ పార్టీని స్టూడెంట్స్ విశ్వసించడం లేదు.
ఈ విషయంలో రాజకీయ పార్టీల ప్రవేశాన్ని HCU గుర్తింపు విద్యార్థి సంఘం తిరస్కరిస్తోంది. మా సమస్యను మేమే పరిష్కరించుకుంటామని తేల్చిచెబుతున్నారు. అయినా, బీఆర్ఎస్ ఈ వ్యవహారంలో స్టూడెంట్స్ మద్దతును క్యాష్ చేసుకునేందుకు విఫలయత్నం చేసింది.
అయినా కేటీఆర్ తగ్గడం లేదు. దీన్ని వెనక పెద్ద రాజకీయం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. HCU ల్యాండ్ లో 130 ఎకరాలను కేసీఆర్ TNGO కు కేటాయించారని ఆరోపణలు ఉన్నాయి. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు కూడా ఇందులో వాటా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారం బయటకు రాకుండా ఉండేందుకు కేటీఆర్ రాజకీయం చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.