రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో కేసీఆర్ ను మించిన వారు లేరు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తన పార్టీ అభ్యర్థులను బీజేపీ ,కాంగ్రెస్ పంచుకున్నప్పటికీ ఆయన అభ్యర్థులను ఖరారు.. చేసి నోటిఫికేషన్ వచ్చిన రోజునే బీఫామ్స్ ఇచ్చేస్తున్నారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకంటే ఒకడుగు ముందుకేసి అందరికంటే ముందుగానే బీఫాంలను ఇస్తున్నారు. పరిస్థితి బాగోలేకపోయినా అభ్యర్థులకు ఎన్నికల ఖర్చు కోసం రూ. 95 లక్షలు కూడా ఇస్తున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థుల విషయంలో డైలమాలో ఉంది. ఇంకా మూడు స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ప్రకటించిన చోట్ల వారే అభ్యర్థులు అవుతారా అన్న సందేహాలు ఉన్నాయి. ఇక రాష్ట్రంలోని 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ… ఒకట్రెండు స్థానాల్లో వారిని మార్చేందుకు నానా తంటాలూ పడుతోంది. ఈ రెండు పార్టీల పరిస్థితి ఈ విధంగా ఉంటే… తన పార్టీ అభ్యర్థులను.. సిట్టింగ్ ఎంపీలను ఆ రెండుపార్టీలు లాక్కున్నా.. ధైర్యంగా అభ్యర్థుల్ని ప్రకటించి.. మరో మాట లేకుండా… ఎన్నికలకు వెళ్తున్నారు.
కడియం శ్రీహరి, గడ్డం రంజిత్ రెడ్డి, కే.కేశవరావు, దానం నాగేంద్రర్ తెల్లం వెంకటరావు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు కూడా పార్టీని వీడారు. హైదరాబాద్ నగరంలో కీలక నాయకుడైన మాజీ మంత్రి మల్లారెడ్డి లాంటి వారు సైతం సైలెంటయిపోయారు. మాములుగా అభ్యర్థుల్ని ఖరారు చేయడానికి వెనుకాడాలి. కానీ కేసీఆర్ రాజకీయం వేరు. దీన్ని పోగొట్టి, క్యాడర్లో నూతనోత్సాహాన్ని నింపేందుకు కేసీఆర్ పలు వ్యూహాలు సిద్దం చేసుకున్నారు. ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయన్న సంగతి పక్కన పెడితే.. డైలమా లేని రాజకీయాలు చేయడంలో కేసీఆర్ నెంబర్ వన్ అనుకోవచ్చు.