టీఆర్ఎస్కు ఈ సారి కూడా కేసీఆరే అధ్యక్షుడిగా ఎన్నికవబోతున్నారు. కేటీఆర్కు వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి ప్రెసిడెంట్గా ప్రమోోషనల్ లభించబోందని జరుగుతున్ ప్రచారం అంతా రూమర్సేనని తేలిపోయింది. టీఆర్ఎస్కు అధ్యక్షుడిగా కేసీఆరే ఉండాలంటూ మంత్రులంతా ఏకగ్రీవంగా తీర్మానించడమే కాదు నామినేషన్ దాఖలు చేశారు. టిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా మాజీ ఎమ్మెల్సీ ఎం. శ్రీనివాస్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆయనకు నామినేషన్ పత్రాలను మంత్రులు అందించారు.
టిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షునిగా కేసీఆర్ ను బలపరుస్తూ తామంతా సమావేశమై ఏకగ్రీవ తీర్మానం చేశామని మంత్రులు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవికి 22వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 23వ తేదీన స్క్రూటినీ ఉంటుంది.25న టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సభ జరుగనుంది. ఆ ప్లీనరీలోనే అధ్యక్షుడ్ని ప్రకటిస్తారు. ముందస్తు ఎన్నికల ఊహాగానాల నడుమ టీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నిక కాస్త ఆసక్తి రేపింది.
మామూలుగా అయితే ఈ ఎన్నిక ప్రక్రియకు ప్రాధాన్యం ఇవ్వరు. కానీ ప్రాధాన్యం ఇవ్వడంతో ఏదో జరుగుతోందని అనుకున్నారు. కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలను కూడా కేసీఆర్ పార్టీ అధ్యక్షుడిగానే ఎదుర్కోబోతున్నారని క్లారిటీ వచ్చింది. వచ్చే ఏడాది ఆగస్టు తర్వాత కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతున్న సమయంలోనే దానికి తగ్గట్లుగానే నిర్ణయాలు తీసుకుంటూడటం ఆసక్తి రేపుతోంది.