ఆదివారం నాడు సికింద్రాబాదులో ప్రజా ఆశీర్వాద సభలో కెసిఆర్ టిఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేశారు. అయితే ఈ మేనిఫెస్టోలో మరీ కొత్త అంశాలు , ఆశ్చర్యపరిచే అంశాలు పెద్దగా లేకపోయినప్పటికీ, ఇప్పటికి లో ఉన్న పథకాలన్నీ కొనసాగించేలా గా అలాగే వాటి పరిధి పెంచే లాగా ఈ మేనిఫెస్టో లోని హామీలు కనిపిస్తున్నాయి. మేనిఫెస్టోలో పొందుపరచిన ప్రధాన అంశాలు ఇవే:
రైతు బంధు పథకం ద్వారా ఇప్పటికే 8వేల రూపాయల సహాయాన్ని రైతులకు అందిస్తున్న విషయం తెలిసిందే దీన్ని ఇప్పుడు పది వేల రూపాయలకు పెంచారు. అలాగే అర్థమైన పేదలకు ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల నుంచి ఆరు లక్ష రూపాయల వరకు సహాయాన్ని అందించే హామీ పొందుపరిచారు. అలాగే పెన్షన్లను పెంచారు. ఆసరా పెన్షన్ లో వికలాంగుల పెన్షన్ లు అన్నింటికీ చెల్లించే మొత్తాన్ని పెంచడమే కాకుండా వృద్ధాప్య పెన్షన్ అర్హత వయస్సును 65 నుంచి 57 సంవత్సరాలకు తగ్గించారు. దీంతోపాటు నిరుద్యోగులకు నెలకు మూడు వేల పదహారు రూపాయలు నిరుద్యోగ భృతి అందిస్తామని హామీ ఇచ్చారు.
ఇక ఆ మధ్య ప్రవేశపెట్టిన కంటి వెలుగు పథకం లాగానే మిగతా ఆరోగ్య సమస్యల కి కూడా ఇలాంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తో పాటు సింగరేణి భూముల్లో ఇల్లు కట్టుకున్న వారికి పట్టాలు ఇస్తామని , రెడ్డి కార్పొరేషన్ వైశ్య కార్పొరేషన్ తో పాటు ఇతర వర్గాల సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇక వీటితో పాటు కొన్ని హామీలు – అన్ని పార్టీలు అన్ని ఎన్నికలలో ఇచ్చే హామీలు – మహిళలకు 33% రిజర్వేషన్ల కోసం పోరాటం, అగ్రకులాల్లో ని పేదల కోసం ప్రత్యేక పథకాలు, ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం పాటు పడటం, ఇలాంటి ఇతర కొన్ని హామీలు మేనిఫెస్టోలో యధావిధిగా దర్శనం ఇచ్చాయి.
ఏది ఏమైనా టిఆర్ఎస్ మేనిఫెస్టో లో కొత్తగా ఆశ్చర్యాన్ని కలిగించే అంశాలు ఏవీ పొందుపరచక పోయినప్పటికీ దాదాపు అన్ని పథకాలను కొనసాగించడం , వాటి పరిధి పెంచడం చూస్తుంటే మొత్తం మీద సంక్షేమ పథకాల తోనే కెసిఆర్ మళ్లీ ఎన్నికలకు వెళ్తున్నట్టు అర్థమవుతోంది.