ఢిల్లీలో పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయని చకచకా ఆలోచించి.. తాము కొత్తగా పెడుతున్న సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత పేరు పెట్టేశారు కేసీఆర్. నిజానికి అంబేద్కర్ పేరు పెట్టాలని ఎవరూ కోరలేదు. డిమాండ్ చే్యలేదు. కానీ ముందుగానే పెట్టేస్తే.. బీజేపీపై ఒత్తిడి పెంచవచ్చని అనుకున్నారు. కానీ ఆ విషయం ఇప్పుడు రివర్స్ అయ్యేలా ఉంది. ఎందుకంటే పెట్టాల్సింది అంబేద్కర్ పేరు కాదు … తెలంగాణ వస్తే దళితుడే ముఖ్యమంత్రి అన్న మాటలను నిలబెట్టుకోవడం. దళితుడ్ని ముఖ్యమంత్రిని చేయడం అనే విమర్శలు ప్రారంభమయ్యాయి.
తెలంగాణ ఉద్యమ సమయంలో .. ప్రత్యేక రాష్ట్రం వస్తే తాను సీఎంను కానని దిళితుడ్ని ముఖ్యమంత్రిని చేస్తానని లేకపోతే తల నరుక్కుంటానని కేసీఆర్ చాలా సార్లు ప్రకటించారు. కానీ రెండు సార్లు గెలిచాక తానే సీఎం అయ్యారు. ఎన్ని సార్లు గెలిచినా తానే సీఎంనని చెబుతున్నారు. సీఎంను చేస్తానంటే దళితులే వద్దన్నారని ఒకటి.. రెండు సార్లు కవర్ చేసుకోవడానికి ప్రయత్నించారు కానీ .. ఎక్కువ చర్చ జరిగితే సమస్య అని సాగదీయలేదు. కానీ ఇప్పుడు.. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడంతో ఇప్పుడు మళ్లీ ఆ అంశం తెరపైకి వచ్చింది.
దళితుల్ని ఆకట్టుకుందామని ప్రయత్నిస్తే పాద దళిత సీఎంహామీ వెలుగులోకి రావడం .. దాన్నే బీజేపీ , కాంగ్రెస్ ప్రధానంగా దళిత వర్గాల్లోకి తీసుకెళ్తే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైన ఈ సమయంలో ఇలా పాతహామీలన్నీ తెరపైకి రావడం .. వచ్చేలా చేసుకోవడం టీఆర్ఎస్కు ఇబ్బందికరమే.