తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఖత్వమని కేసీఆర్ ఎమ్మెల్యేలతో అన్నారు. అసెంబ్లీలో ఎలా పోరాడాలో దిశానిర్దేశం చేసేందుకు ఎమ్మెల్యేలతో ఫామ్ హౌస్లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహ మార్పును తప్పు పట్టినట్లుగా ఎమ్మెల్యేలు తెలిపారు. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఏంటి.. రేవంత్ ప్రభుత్వం ఏం చేస్తుందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వాలు మార్పులు చేసుకుంటూ పోతే ఎలా అని …. ప్రభుత్వం చేయాల్సింది సమస్యల పరిష్కారం అని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శాసనసభ సమావేశాలకు ఖచ్చితంగా హాజరుకావాలని సూచించారు. అంశాలవారీగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలన్నారు.
రైతుబంధు తెచ్చిన ఉద్దేశం, ప్రయోజనాలు వివరించాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైందన్నారు. గురుకులాలు, విద్యారంగంలో వైఫల్యాలు ఎండగట్టాలని పిలుపునిచ్చారు. మూసీ, హైడ్రా విషయంలో ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని.. నిర్బంధ పాలన గురించి అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాలన్ని సూచించారు.
కేసీఆర్ మాత్రం సమావేశాలకు వచ్చే ఉద్దేశం లేరని స్పష్టమయింది. ఫిబ్రవరిలో భారీ బహిరంగసభకు ప్లాన్ చేసినట్లుగా తెలిపారు. ఫిబ్రవరి తర్వాత పార్టీలో అన్ని కమిటీలు ఏర్పాటు చేస్తామని ఆ తర్వాత సభ్యత్వ నమోదు ఉంటుందని తెలిపారు. కేసీఆర్ తెర వెనుక వ్యూహాలకే ఫిబ్రవరి వరకూ పరిమితమవుతారని తెలుస్తోంది.