హైదరాబాద్: రాజమండ్రి దుర్ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గోదావరి పుష్కరాలు సజావుగా సాగాలని భగవంతుడిని ప్రార్థించినట్లు చెప్పారు. కేసీఆర్ ఇవాళ ఉదయం కరీంనగర్ జిల్లా ధర్మపురిలో పుష్కర స్నానమాచరించారు.