తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఓటుకు నోటు కేసు ఓ హాట్ టాపిక్‌గా మారింది. మూడేళ్ల కిందట రేవంత్ రెడ్డి.. స్టీఫెన్సన్ అంటే నామినేటెడ్ ఎమ్మెల్యే ఇంట్లో డబ్బులిస్తూ.. రెడ్ హ్యాండెడ్‌గా అదీ కూడా.. పక్కాగా పదిహేను కెమెరాలను.. అన్ని యాంగిల్స్‌లోనూ ఏర్పాటు చేసిన పక్కా స్కెచ్‌లో దొరికిపోవడం సంచలనం సృష్టించింది. ఈ కేసులోఏసీబీ ఎందుకు ఇన్వాల్వ్ అయిందో ఎవరికీ అర్థం కాలేదు. బహుశా.. తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు అత్యంత విశ్వసనీయ పోలీసులు ఏసీబీలో ఉండటం వల్లో… లేక ఏసీబీ కేసులు పటిష్టంగా ఉంటాయన్న ఆలోచనతోనే… ఏసీబీని ఇన్వాల్వ్ చేశారన్న అభిప్రాయాలున్నాయి. ఏమైనా కానీ కేసు ఇప్పుడు కూడా ఏసీబీ పరిధిలోనే ఉంది. మత్తయ్య వేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపి.. ఆతనిని కేసు నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో…హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. దాని ప్రకారం చూస్తే.. ఓటుకు నోటు కేసు అప్పుడే తేలిపోయింది.
మత్తయ్య క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పు (W.P.NO .5520/2015) లో పోలీసుల నివేదిక, చార్జిషీట్లో పేర్కొన్న విషయాల ప్రకారం… ఈ కేసు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కిందకు రాదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. స్టీఫెన్సన్ నామినేటెడ్ ఎమ్మెల్యే. అతని ఓటు హక్కు రాజ్యాంగ హక్కు కాదు. స్టాట్యూటరి రైట్ మాత్రమే. ఓటు వేయడం అనేది పబ్లిక్ డ్యూటీ కిందకు రాదని.. హైకోర్టు స్పష్టం చేసింది. ఎఫ్ఐఆర్ దాఖలు చేయకుండా దర్యాప్తు చేయడం అనేది చట్టరీత్యా ఆమోదయోగ్యం కాదు. ఈ కేసులో ఏసీబీ అధికారులు .. ఫిర్యాదు అందిన తర్వాత మూడు రోజుల పాటు ఎఫ్ఐఆర్ వేయకుండా… దర్యాప్తు చేశారు. కుట్ర పూరితంగా స్టింగ్ ఆపరేషన్లు చేశారు. నేరం చేసేలా… ఓ వ్యక్తిని ప్రొత్సహించారు. ఏసీబీ ప్రవర్తన..సహజ న్యాయసూత్రాలకు,గతంలో కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా ఉందని హైకోర్టు తన తీర్పులో స్పష్టంగా పేర్కొంది. ఎఫ్ఐఆర్ లేకుండా దర్యాప్తు చేసిన కారణంగానే.. మత్తయ్య సహా.. ఎవరిపైనా కేసు నిలబడే అవకాశం లేదని హైకోర్టు స్పష్టంగా ప్రకటించారు.
హైకోర్టు ఇచ్చిన తీర్పుపై… తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో ఉంది. అయితే ఇక్కడే అదే కేసులో వైసీపీకి చెందిన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి..మరోసారి దిగువకోర్టుకెళ్లారు. తాను ప్రైవేటు ల్యాబ్స్‌లో టెస్టులు చేయించానని రామకృష్ణారెడ్డి చెప్పగానే… దానిపై విచారణకు ఆదేశించింది దిగువ కోర్టు. దీన్ని కూడా.. హైకోర్టు నిలిపివేసింది. కేసుతో రామకృష్ణారెడ్డికి ఏం సంబంధమని ప్రశ్నించింది. దీనిపై కూడా… రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం ఈ దావా కూడా అక్కడే ఉంది. ఇప్పుడు కొత్తగా తెలంగాణ ప్రభుత్వం.. ఓటుకు నోటు కేసులో సమీక్షలంటూ హడావుడి చేస్తోంది. కానీ .. నిజానికి కేసు ఎప్పుడో తేలిపోయిన సంగతి…తెలంగాణ ప్రభుత్వ పెద్దలకూ తెలుసు. కేవలం.. రాజకీయ ప్రయోజనాల కోసమే.. ఇప్పుడు కొత్తగా గేమ్ స్టార్ట్ చేశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చివరికి ఏం తేలుతుందన్నది పక్కన పెడితే..అప్పటి వరకూ.. ఓటుకు నోటు కేసును లైమ్ లైట్లో ఉంచి.. ఏపీలో జరుగుతున్న పరిణామాలను… పక్కదోవ పట్టించవచ్చనేదే.. అసలు ప్లాన్‌లో భాగంగా కావొచ్చని టీడీపీ నేతల అనుమానం.