తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్.. ఏపీలో ప్రతిపక్షం ఫెయిలందని తేల్చేశారు. చంద్రబాబుపై.. తన మార్క్ విమర్శలు చేయడం లేదని.. ఆయన భావించారో.. లేక జగన్మోహన్ రెడ్డికి.. సరిగ్గా పోరాడటం చేతకాలేదో కానీ… మొత్తానికి ప్రతిపక్షం ఫెయిలయిందని.. తాము రంగంలోకి దిగుతున్నామని ప్రకటించారు. కేసీఆర్‌కు.. వైసీపీ ఇస్తున్న అవుట్ రైట్ సపోర్ట్‌తో.. ఇది నిజమేనని ప్రజలకు అనిపించినా తప్పు లేదు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. దీనిపై స్పందించడానికి ముందుకు రాకపోవడమే కాస్త .. తేడాగా ఉంది. తాము ప్రతిపక్షంగా విఫలమైనా.. కేసీఆర్ రంగంలోకి దిగినా.. తమనే గెలిపిస్తాడని… ఆయనేమీ వచ్చి… లేకపోతే ఆయన పార్టీ వచ్చి.. ఏపీలో అధికారం చేపట్టుదు కదా.. అనే ధీమా వారిలో కనిపిస్తున్నట్లుగా ఉంది.
ఏపీలో ప్రతిపక్షం విఫలమయిందని.. ఇప్పుడు కొత్తగా కేసీఆర్ సర్టిఫికెట్ జారీ చేశారు కానీ… అసెంబ్లీని బహిష్కరించినప్పుడు.. ఎంపీలు పార్లమెంట్ నుంచి పారిపోయినప్పుడే.. జగన్ ప్రతిపక్షంగా ఫెయిలయ్యారని ఏపీ ప్రజలు నిర్ణయించుకున్నారు. ఈ కోణంలోనే కేసీఆర్ కూడా.. ఏపీలో ప్రతిపక్షానికి చేత కావడం లేదని తేల్చేశారు. మొత్తానికి ఏపీలో ఇక నుంచి.. ప్రతిపక్షం టీఆర్ఎస్సేనని.. కేసీఆర్ మాటల ద్వారా.. కేసీఆర్ మాటలకు.. వైసీపీ ఇస్తున్న మద్దతు ద్వారా తేలిపోతోంది. అయితే.. కేసీఆర్ చేసే ప్రతిపక్ష పనుల వల్ల.. వైసీపీకి ఎంత మేర లాభం కలుగుతుందన్నదే.. ఇక్కడ ఆసక్తికరం.
కేసీఆర్.. తనను చేతకానివాడని నేరుగా… విమర్శించినప్పటికీ.. వైసీపీ, ఆయన నేతలు మాత్రం.. సైలెంట్‌గా ఉండిపోతున్నారు. ప్రతిపక్షం ఫెయిలయిందంటే.. అది ఒక్క జగన్ మాత్రమే కాదు కదా.. వైసీపీ నేతలందరూ ఫెయిలయినట్లే. అయినా సరే.. కేసీఆర్ పై విమర్శలు చేయడానికి వారు సిద్ధపడటం లేదు. కేసీఆర్ …. ఎన్నికల ప్రచార సభల్లో… అత్యంత దారుణంగా.. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని విమర్శించినా… ఎన్నికల్లో వైసీపీ… ఆ పార్టీ మద్దతుదారులు మొత్తం… టీఆర్ఎస్కు సపోర్ట్ చేశారు. ఇప్పుడు స్వయంగా… ప్రతిపక్ష నేతగా జగన్ ఫెయిలయ్యారని.. తీర్మానించేసినా.. ఏమీ అనలేని పరిస్థితి… వైసీపీ నేతలది..!