తెలంగాణ రాష్ట్ర సమితిలో కోవర్టులున్నారు. సొంత పార్టీలో ఉంటూ..ఇతర పార్టీలు ఎదగడానికి సాయం చేస్తున్నారు. సొంతపార్టీని బద్నాం చేస్తున్నారు. సీక్రెట్ ఆపరేషన్లు నిర్వహించి… తమ పార్టీని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వారు ఎవరెవరో కేసీఆర్‌కు రిపోర్ట్ అందింది. దానికి సంబంధించి .. తమకు బాగా తెలిసిన మీడియాకు.. లీకులు ఇస్తున్నారు. ఇప్పటికే ఓ మంత్రి.. కొంత మంది ఎమ్మెల్యేలపై విస్తృతమైన ప్రచారం జరుగుతోంది. ఆ మంత్రి ఎవరో.. ఆ ఎమ్మెల్యేలు ఎవరో టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా పేర్లు కూడా ప్రచారం అవుతున్నాయి. అందరికీ తెలుసు కానీ.. ఎవరి పేర్లనూ వారు బయటపెట్టడం లేదు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు… కేసీఆర్‌కు కొత్త శక్తినిచ్చింది. వాటిల్లో ఓడిపోయి ఉంటే పరిస్థితి తేడాగా ఉండేది. అయితే ఎప్పుడూ లేనిది హైదరాబాద్ స్థానంలోనూ గెలవడంతో కేసీఆర్ లో పాత రాజకీయ నాయకుడు బయటకు వచ్చారు. పార్టీకి ద్రోహం చేయడానికి ప్రయత్నించిన వారి జాబితాను రెడీ చేసుకున్నారు. ఇంటలిజెన్స్ వర్గాలు ఎప్పటికప్పుడు ఇచ్చిన నివేదికల ప్రకారం… ఓ మంత్రి .. పలువురు ఎమ్మెల్యేలు…బీజేపీ అభ్యర్థులకు మాట సాయం చేశారు. టీఆర్ఎస్కు ఇబ్బంది కలిగేలా చేశారు. కొంత మంది లోపాయికారీగా ఇతర పార్టీలతో అవగాహన పెట్టుకుటున్నారు. ఈ జాబితాలో కేసీఆర్ అనుమానించేవారితో పాటు.. నమ్మకంగా ఉండేవారు కూడా ఉన్నారని అంటున్నారు.
కొద్ది రోజుల కిందట సీఎం పీఆర్వో గా ఉండే వ్యక్తిని తొలగించారు. ఆ తొలగింపు వెనుక కూడా.. చాలా కథ ఉందని… ఆయన అవినీతి ఒక్కటే కాదని… టీఆర్ఎస్లో రెబెల్స్‌గా మారే ప్రమాదం ఉన్న కొంత మంది నేతలకు… కేసీఆర్ సమాచారం ఇస్తున్నది ఆ పీఆర్వోనేనని తేలడంతోనే ఆయనను పంపేశారని అంటున్నారు. టీఆర్ఎస్లో కోవర్టులపై ఇప్పుడు మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. వారెవరన్నదానిపై కేసీఆర్ ఏదో చర్య తీసుకుంటూనే కానీ బయటపడదు.