కాంగ్రెసేతర, బీజేపీయేతర కూటమిని ఏర్పాటు చేసి.. కేంద్రంలో చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్‌కు… ఏదీ కలసి కలసి రావడం లేదు. స్టాలిన్.. తన ప్రతిపాదనలను కచ్చితంగా ఆమోదిస్తారన్న నమ్మకంతో ఉన్న కేసీఆర్.. సమావేశం తర్వాత .. ఆ పార్టీకి కూడా ఇంటూ టిక్ పెట్టుకోవాల్సి వచ్చింది. కానీ… కేసీఆర్ లో మాత్రం… ఫెడరల్ ప్రంట్ ఆశలు ఇంకా ఉన్నాయని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. పర్యటనలు కొనసాగుతాయని అంటున్నారు. అది ఫలితాలకు ముందు కాదు.. తర్వాత కూడా ఉంటాయంటున్నారు.
ఏ పార్టీకి అయినా వంద సీట్లు అవసరం పడుతుందన్న అంచనాలో కేసీఆర్..!
సార్వత్రిక ఎన్నికలు ఆరు దశలు పూర్తయిన తర్వాత కేసీఆర్ కు ఫలితాలపై ఓ క్లారిటీ వచ్చింది. దాంతో.. .ఆయన ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలను మరింత సీరియస్‌గా చేయాలనుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ఆ తర్వాత చేసిన ప్రయత్నాలు పెద్దగా సక్సెస్ కాలేదు. అప్పట్లో రాజకీయ అనివార్యత లేకపోవడంతో… చాలా పార్టీలు… కేసీఆర్‌తో సానుకూలంగా మాట్లాడి పంపించాయి. కానీ ఇప్పుడు.. మాత్రం కేంద్ర ప్రభుత్వంలో తమ సత్తా చాటాలంటే… సమైక్యంగా బలం చూపించుకుని… ఫలితం పొందాల్సి ఉంటుంది. ఈ విషయం కేసీఆర్ తో పాటు ప్రాంతీయ పార్టీల నేతలకూ తెలుసు. అందుకే.. కేసీఆర్.. దీన్నే గురి పెట్టి ఫెడరల్ ప్రంట్ ప్రయత్నాలు కొనసాగించబోతున్నారు.
నవీన్, మమతా, మాయ, అఖిలేష్, జగన్ లతో కలిపి ఆ వంద సీట్లు..!
కేసీఆర్ అంచనా ప్రకారం… అటు బీజేపీకి అయినా.. ఇటు కాంగ్రెస్‌కు అయినా కనీసం వంద సీట్లు.. ప్రభుత్వ ఏర్పాటుకు తగ్గుతాయనే అంచనా ఉంది. ఆ వంద సీట్లు తాను భర్తీ చేస్తే… కేంద్రంలో చక్రం చేతికి వచ్చినట్లేనని.. కేసీఆర్ అంచనా. తనకు పదిహేను… జగన్‌కు పదిహేను కలిసి ముప్ఫై సీట్లు ఇప్పటికే వచ్చాయని… మరో… డెభ్బై సీట్లు వచ్చే పార్టీలను… కూటమిలోకి లాగితే పనైపోయినట్లేనని కేసీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగా మొదట కమ్యూనిస్టు పార్టీలను కదిలించారు. పినరయి విజయన్ ప్రొత్సహకరమైన మాటలు చెప్పినప్పటికీ.. సీతారం ఏచూరీ కానీ… సురవరం సుధాకర్ రెడ్డి కానీ… కేసీఆర్‌ను నమ్మడానికి లేదని ప్రకటించేశారు. స్టాలిన్ కూడా నిరాసక్తత వ్యక్తం చేశారు. కానీ.. కేసీఆర్ ముందు ఇంకా పలు మార్గాలున్నాయి. ఏ కూటమిలో లేని నవీన్ పట్నాయక్, మమాత బెనర్జీ, మాయావతి, అఖిలేష్ యాదవ్‌లు … ఫెడరల్ ఫ్రంట్‌గా మారేందుకు ఆసక్తిగా ఉన్నారని అంచనా వేస్తున్నారు. వీరందరితో కలిసి కూటమిగా మారితే.. అనుకున్న ఎఫెక్ట్ వస్తుందని కేసీఆర్ భావిస్తున్నారు.
టార్గెట్ పెట్టుకుని ఫెడరల్ ప్రయత్నాల్లో కేసీఆర్..!
కేసీఆర్ ప్రధానమంత్రి పదవిపై గురి పెట్టలేదు. ఆయనకు ఉప ప్రధాని చాలు. అందుకే.. వంద సీట్ల టార్గెట్ పెట్టుకున్నారు. అయితే… కేసీఆర్ ఉప ప్రధాని పదవి కోసం.. తాము ఎందుకు.. ఆయన కూటమిలో చేరాలన్న ఆలోచన… ఇతర పార్టీలకు వస్తాయి. అందుకే… ప్రధానమంత్రి పీఠాన్ని.. ఆయన పార్టీలకు ఆఫర్ చేయబోతున్నారు కేసీయార్. మాయావతి , మమతా బెనర్జీ ఢిల్లీ పీఠంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తమకు పీఎం పదవి ఇస్తే.. ఎవరితో అయినా సరే.. పొత్తులకు… రెడీ అన్నట్లుగా ఉంది వీరి వ్యవహారం..ఈ పాయింట్‌నే కేసీఆర్ క్యాచ్ చేయబోతున్నారు. త్వరలో నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ, అఖిలేష్, మాయావతితో భేటీకి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవి సక్సెస్ అయితే… ఫలితాల తర్వాత ఫెడరల్ ఫ్రంటే కీలకం కానుంది.