ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు… తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఆ సమయంలో ఏపీ ఇంటలిజెన్స్ బృందాలు .. తెలంగాణలో విస్తృతంగా ప్రజాభిప్రాయసేకరణ జరిపాయి. కీలక విషయాలను రాబట్టాయి. దీనిపై దుమారం రేగింది. అప్పట్లో చంద్రబాబు పొలిటికల్ ఇంటలిజెన్స్ అనేది ప్రతీ ప్రభుత్వంలో ఉంటుందని అదేమీ కొత్త.. వింత కాదని సమర్థించుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ కూడా అదే చేస్తున్నారు. తమ ఇంటలిజెన్స్ పోలీసుల్ని ఏపీలో పరిస్థితిని అధ్యయనం చేయడానికి పంపించినట్లుగా తెలుస్తోంది.
బీఆర్ఎస్లో ముగ్గురు నేతల చేరిక తర్వాత పరిస్థితిని ఏమిటో అంచనా వేయాలని.. బీఆర్ఎస్ అవకాశాలు, ప్రజాభిప్రాయం ఎలా ఉందో తెలంగాణ ఇంటలిజెన్స్ ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. కనీసం పదికి పైగా బృందాలు ప్రస్తుతం ఏపీలో ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత ప్రభుత్వంపాలన… తెలంగాణ ప్రభుత్వ పథకాల పై అభిప్రాయం… కేసీఆర్ తెలంగాణలో చేస్తున్న అభివృద్ధి… ఏ వర్గాన్ని నమ్ముకుంటే ఓటు బ్యాంక్ వస్తుంది.. అలాంటి అంశాలపై ఇంటలిజెన్స్ ఆరా తీస్తున్నట్లుగా చెబుతున్నారు.
అప్పట్లో ఏపీ ఇంటలిజెన్స్ అధికారులు తెలంగాణలో పర్యటిస్తే.. పలు చోట్ల స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. కానీ ఇప్పుడు ఏపీలో అలా అడ్డుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే… ఇక్కడ బీఆర్ఎస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉంది. తెలంగాణ ఇంటలిజెన్స్ వచ్చినా.. వారు నేరుగా వైసీపీ నేతలతో సంప్రదింపులు జరిగినా వారిని అడ్డుకునేంత ధైర్యం వైసీపీ లేదనే వాదన ఉంది….కాబట్టి వివాదాలు రావు.