తెలంగామ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది.అయితే ఆయనకు పెద్దగా లక్షణాల్లేవు. ఓ సారిఅన్ని టెస్టులు చేయించుకున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఆయనపూర్తి స్థాయిలో కోలుకుంటారని చెబుతున్నారు. ఫామ్‌హౌస్‌లో ఉన్న ఆయన… అధికారులకు తరచూ ఆదేశాలు జారీ చేస్తూనే ఉన్నారు. అంతే కాదు.. పార్టీని కూడా పట్టించుకుంటున్నారు. మినీ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ శ్రేణులకు కేసీఆర్ స్వయంగా దిశానిర్దేశం చేస్తున్నారట. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలపై కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారని చెబుతున్నారు.
30 న వరంగల్ , ఖమ్మం కార్పొరేషన్ల తో పాటు ఐదు మున్సిపాలిటీ లకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రచారం చేపట్టాలని మంత్రి కేటీఆర్ భావించారు. అయితే ఆయనకు పాజిటివ్ రావడంతో హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. దీంతో కేసీఆర్.. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ.. పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సర్వే రిపోర్టులు తెప్పించుకుంటూ.. ఎక్కడెక్కడ పార్టీ బలహీనంగా ఉందో చెబుతూ.. పార్టీ నేతల్ని అలర్ట్ చేస్తున్నారు.
దాదాపుగా ప్రతీ రోజు రెండు కార్పొరేషన్లు, ఐదు మునిసిపాల్టీల బాధ్యతలు తీసుకున్న మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎంపి లు , ఎమ్మెల్సీ లకు సీఎం ఫోన్లు చేస్తున్నారు. మిగతా చోట్ల సంగతేమో కానీ.. వరంగల్‌లో బీజేపీ కాస్త దూకుడుగా ఉందని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే అక్కడ ఒక్క డివిజన్ కూడా వదిలి పెట్టకుండా గెలవాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో ఈ మినీ మున్సిపల్ ఎన్నికల తర్వాత ఇక ఏ ఎన్నికలు ఉండవు. దీంతో.. ఫైనల్ పంచ్.. టీఆర్ఎస్దే అవ్వాలని కేసీఆర్ పట్టుదలగా ఉన్నారంటున్నారు.