భారత రాష్ట్ర సమితి చీఫ్ కేసీఆర్ బయటకు రాకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. ఆయనకు ఏదో అయిందంటూ పుకార్లు లేపడం దగ్గర నుంచి కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం వరకూ చాలా మంది ఫామ్ హౌస్ జీవతంపై భిన్న ప్రచారాలు చేస్తున్నారు. గజ్వల్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన కనిపించడం లేదని కొంత మంది పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి మీడియాకు కాస్త న్యూస్ ఇచ్చారు.
కేసీఆర్ ఫామ్ హౌస్ గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోనే ఉంటుంది. అంటే ఆయన అత్యధిక కాలం తన నయోజకవర్గంలోనే ఉంటున్నారు. ఎవర్నీ కలవకపోవచ్చు… కుటుంబసభ్యులతో మాత్రమే ఉండవచ్చు కానీ ఆయన నియోజకవర్గంలోనే ఉంటున్నారు. ఆ విషయం తెలిసి కూడా కొంత మంది నేతలు పబ్లిసిటీ కోసం ఆయనపై ఫిర్యాదు చేశారు. మౌనం అనేది కేసీఆర్ రాజకీయ వ్యూహాల్లో ఒకటి. ఆయన ఎందుకు మౌనంగా ఉంటున్నారన్న ఓ ప్రచారాన్ని పీక్ స్టేజ్ తీసుకు వెళ్లి ఆతర్వాత గ్రాండ్ ఎంట్రీ ఇస్తారు.
కేసీఆర్ ప్రజాతీర్పుతో చాలా వరకూ నీరసపడిపోయారు. ఎంత చేసినా ప్రజలు అవమానించారన్న అసంతృప్తి లో ఆయన ఉన్నారు. ప్రజలు ఏదో తప్పు చేశారని అనుకుంటున్నారు. అయితే ప్రజాస్వామ్యంలో అలా అనుకోవడం వల్ల ప్రయోజనం ఉండదని ఆయన వెంటనే రియలైజ్ అయి ఉంటారని అంటున్నారు. కానీ సరైన సమయంల తెరపైకి వస్తే వచ్చే ఎఫెక్ట్ వేరుగా ఉంటుంది కాబట్టి సమయం కోసమే ఎదురు చూస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.