ఆయన మెంటల్..! తనే ఒప్పుకుంటాడు. కేఏ పాల్ సీరియస్ కామెడీ చేస్తాడు. ఈయన అంతే సీరియస్‌గా ఇష్టం లేని వాళ్లపై బూతులు లంకించుకుంటారు. కామెడీ చేసినా పద్దతిగా ఉండటం.. కెఏ పాల్ లక్షణం. అందుకే అందరూ గౌరవిస్తారు. కానీ ఈ మెంటల్ బూతులు వింటే ఇంట్లో వాళ్లకి కూడా వాంతొస్తుంది. అందుకే సెన్సార్ లేని యూట్యూబ్‌కే ఆయన పరిమితం. ఇప్పుడు ఈ మెంటల్‌కి ఇంకో జీనియస్ తోడయ్యారు. ఆయన చిన్నికృష్ణ. ఇద్దరూ కలిసి మెగా ఫ్యామిలీ మీద ఏడ్చేస్తున్నారు. తెలంగాణ పాలకుల ప్రాపకం కోసం మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసుకుంటున్నారు.
“ఇంద్ర” సరే… బద్రీనాథ్, జీనియస్, సీమ సింహం కథేంటి చిన్ని కృష్ణగారూ..!
మెగా ఫ్యామిలీని తనే సినిమాల్లోకి తీసుకొచ్చినట్లు.. తన వల్లే.. వాళ్లు ఈ స్థితిలో ఉన్నట్లుగా.. అల్లు అర్జున్ను తానే హీరో చేశానన్నట్లుగా.. మాట్లాడేసి… వాళ్ల మీద ఇష్టం వచ్చినట్లు… మాట్లాడేసిన చిన్ని కృష్ణ ఎవరు..? ఆయన అంత గొప్ప రైటరా..? రజనీకాంత్ బాషా అనే సినిమాకు స్క్రీన్ ప్లే విభాగంలో పని చేసిన పది మందిలో ఆయనొకరు. అక్కడ ఐడియాలు కొట్టుకొచ్చి… నరసింహనాయుడు అనే సినిమాకు కథ ఇచ్చారు. ఆయన బాగా తెలివి మీరిన వ్యక్తి. ఇండస్ట్రీలో ఎలా పేరు వస్తుందో బాగా తెలుసు కాబట్టి.. .తానేదో.. కొత్తగా పుట్టుకొచ్చిన ఆధునిక టాలీవుడ్ “శ్రీశ్రీ”నని అన్నట్లుగా ప్రచారం చేసుకున్నారు. ఎన్ని పెయిడ్ ఇంటర్యూలు ఇచ్చుకున్నారు. ఆయన దగ్గర నుంచి కవర్లు అందుకున్నవారికి తెలుసు. ఆ ప్రచారం పుణ్యమో.. మరో కారణమో… హిట్టొచ్చిన సెంటిమెంట్ ఏమో కానీ.. ఆయనకు ఇంద్ర సినిమా రూపకల్పనలో రచయిత కేటగిరిలో చాన్సిచ్చారు. ఆ సినిమా చూసినంత సేపు.. వేరే తెలుగు సినిమాలు గుర్తొస్తాయి. సినిమా హిట్టయింది. కానీ అదే ఏడాది బాలకృష్ణకు సీమ సింహం అనే సినిమాకు కథ ఇచ్చారు. దానికి నరసింహనాయుడుకు వచ్చిన లాభంతో.. డబుల్ లాస్ అయింది. దానికెవరు బాధ్యత వహిస్తారు..? గంగోత్రి సినిమా క్రెడిట్ తన ఖాతాలో వేసుకుంటున్నారు చిన్ని కృష్ణ. అలా అయితే.. ఆయనకు మళ్లీ పెన్ను పట్టుకునే అవకాశం టాలీవుడ్ ఎనిమిదేళ్ల పాటు ఎందుకివ్వలేదు. ఎనిమిదేళ్ల తర్వతా మళ్లీ కథ ఇచ్చిన బద్రీనాథ్.. రూ. 50 కోట్లకు తన్నేసింది. దానికి ఎవరు బాధ్యులు..? జీనియస్ పేరుతో… సినిమా తీసి ఓ కుటుంబాన్ని రూ. 20 కోట్లకు ముంచేసిన పాపం ఎవరిది..? చిరంజీవి 150వ సినిమాకు కథ తీసుకోలేదనే కదా.. ఇప్పుడీ ఏడుపు..?
చీటింగ్ “చిన్ని కృష్ణ” కన్నింగ్ వేషాల్లో రాటుదేలిపోయారే..?
చిన్ని కృష్ణ… కాకా పట్టడంలో కన్నింగ్ నెస్ని ఇండస్ట్రీలో అందరూ చూసేశారు. పవన్ కల్యాణ్.. తెలంగాణలో పరిస్థితులపై విమర్శలు చేస్తే.. తనేదో పెద్ద సెలబ్రిటీ అన్నట్లుగా.. ప్రెస్ మీట్ పెట్టేసి చెలరేగిపోయిన ఈ చిన్ని కృష్ణ… పవన్ కల్యాణ్‌ను కాకాపట్టడానికి ఎంత ప్రయత్నం చేశారో బహిరంగమే. ఒకప్పుడు పవన్ కల్యాణ్ “కామన్‌మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్” పెడతాననేగానే.. ఆయనకు దగ్గరవడానికి ఇంత కన్నా గొప్ప చాన్స్ ఉండదనుకున్నారేమో.. వెంటనే మద్దతు ప్రకటించి విరాళం ఇస్తాననేశారు. దాన్ని పట్టుకుని ఆయన దగ్గరకు ఎన్ని సార్లు కథలు పేరుతో… కాపీ స్టోరీలు తీసుకెళ్లారో… సినీ జనానికి తెలియదా..? అంత ఎందుకు.. చిన్ని కృష్ణ ఎంత మందిని మోసం చేశారో.. ఇండస్ట్రీలో కథలు కథలుగా చెప్పుకుంటారు. ఎన్ని చీటింగ్ కేసులున్నాయో.. ఎవరికీ తెలియదనుకుంటారా..?. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికీ చీటింగ్ కేసు లేదా..?. అవకాశాలివ్వలేదన్న కోపం… కేసుల భయం… ఏదైనా కాకాపడితే.. భవిష్యత్‌లో చిల్లర వస్తుందన్న ఆశతోనే కదా.. మెగా ఫ్యామిలీపై రాళ్లేస్తోంది..?
హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రులంటే వీళ్లిద్దరేనా..?
ఓ పోసాని.. మరో చిన్ని కృష్ణ..! వీళ్లేనా హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రులు. తాము హ్యాపీగా బతికేస్తున్నాం అంటున్నారు కదా.. మరి ఎందుకు పవన్ కల్యాణ్ మీద చెలరేగిపోవడం. దాడులకు గురైన వారి గురించి… ఇబ్బందులు పడుతున్న వారి గురించీ పవన్ మాట్లాడుతున్నారు. ఆత్మగౌరవం తాకట్టు పెట్టేసి… సొంత రాష్ట్రంపై దాడులు చేసే వారి గురించి కాదు..! అయినా.. వీళ్లెందుకు భుజాలు తడుముకుంటున్నారు. వీళ్లెందుకు.. చెలరేగిపోతున్నారు…? వీరి వెనుక ఎవరున్నారో… అందరికీ తెలుసు. అసలు మ్యాటర్లో వీళ్లకేమీ సంబంధం లేకపోయినా.. మెగా ఫ్యామిలీని తిట్టి తెలంగాణ పాలకుల మోచేతి నీళ్లు తాగుదామనే కదా..!.
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఆత్మగౌరవ పోరాటం జరుగుతోంది. ఆంధ్రులను రాక్షసులని వర్ణించి.. కుక్కల్లా తరిమికొడతామని బెదిరించిన వారే.. ఇప్పుడు ఏపీపై పెత్తనానికి వస్తున్నారు. దానికి హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రులనే అస్త్రంగా వాడుకుంటున్నారు. అది బహిరంగ రహస్యం.. కానీ.. ఆ ప్రయత్నాలకు.. తమ స్వప్రయోజనాలకు… ఇలాంటి వాళ్లు ట్రెయిటర్లుగా మారుతున్నారు. పాలకుల ప్రాపకం కోసం.. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు.