కాంగ్రెస్ తరపున చెన్నూరు నుంచి పోటీ చేస్తున్న వీ6 చానల్, వెలుగు పత్రిక యజమాని, వెంకటస్వామి కుమారుడు వివేక్ వెంకటస్వామి దగ్గర కేసీఆర్ కోటికిపైగా తీసుకున్నారు. 2018 ఎన్నికల అఫిడవిట్లో కేసీఆర్ వివేక్ కు రూ.కోటి ఆరు లక్షల అప్పు ఉన్నానని ప్రకటించారు. అప్పటికి వివేక్ బీఆర్ఎస్ లో ఉన్నారు. తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో వివేక్ కు టిక్కెట్ ఎగ్గొట్టారు. దాంతో ఆయన బీజేపీలో చేరిపోయారు ఈ ఎన్నికల నాటికి కాంగ్రెస్ లోకి చేరిపోయి చెన్నూరు నుంచి పోటీ చేస్తున్నారు. కేసీఆర్ ను ఓడించడమే లక్ష్యమని చెబుతున్నారు.
అయితే ఈ ఏడాది కూడాకేసీఆర్ తాను వివేక్ కు బాకీ ఉన్నానని అఫిడవిట్ లో పెట్టారు. వివేక్ కూడా.. తనకు కేసీఆర్ రూ. కోటి ఆరు లక్షలు ఇవ్వాలని అడవిట్ లో దాఖలు చేశారు. మరి ఆ అప్పు ఏ రూపంలో తీసుకున్నారు.. వడ్డీ ఏమీ ఉండదా లాంటి డౌట్స్ సామాన్యులకు వస్తున్నాయి. అదే సమయంలో రాజగోపాల్ రెడ్డికి కూడా రూ. కోటిన్నర అప్పు ఇచ్చారు. బహుశా.. ఆయన మునుగోడు ఉపఎన్నికల్లో పోటీ చేసినప్పుడు సర్దుబాటు చేసి ఉంటారు.
విశాఖ ఇండస్ట్రీస్ చైర్మన్ గా ఉన్న వివేక్.. చాలా పరిశ్రమలు నడుపుతున్నారు. తెలంగాణ రాజకీయ నేతల్లో ఆయన అత్యంత ధనవంతుడు. మామూలుగా ఆయన కంటే ధనవంతులు ఉంటారు కానీ.. తన పేరు మీద ఆస్తుల్ని చూపించుకోగలిగిన రాజకీయ నాయకుడు ఆయన. ఆయన ఇతర పార్టీల రాజకీయ నేతలకు అప్పులు ఇవ్వడం ఆసక్తికరమే. ఇంకా చెప్పారంటే.. రాజగోపాల్ రెడ్డి కూడా కుబేరుడే. వివేక్ దగ్గర అప్పు తీసుకోవడం ఆసక్తికరమే.