తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత.. సీఎం కేసీఆర్ తాను అనుకున్నదే చేస్తారు. ఎవరేమని అనుకుంటారోనని ఆయన అసలు ఆలోచించరు. ముఖ్యంగా ముఖ్యమంత్రులు ఫార్మాలిటీగా పాల్గొనే కార్యక్రమాల విషయంలో ఆయన ఇలాగే ఉంటారు. చాలా మంది మనోభావాల పేరుతో రాజకీయం చేస్తారని తెలిసినా తాను చేయాలనుకున్నదే చేస్తారు. తాజాగా అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించలేదు. దీంతో ఆయనపై విపక్షాల నేతలు విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌కు సీఎం కుర్చీ వచ్చిందే అంబేద్కర్ వల్ల అని ఆయనకు నివాళులు అర్పించే తీరిక కూడాలేదా.. అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
అంబేద్కర్‌కు నివాళులర్పించడానికి.. కేసీఆర్‌కు 2 నిమిషాల సమయం లేకపోవడం బాధాకరమని.. బండి సంజయ్ మండిపడ్డారు. నిజానికి కేసీఆర్ ఇలాంటి ఫార్మాలిటీ కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా అరుదు. జయశంకర్ సార్ జయంతి, వర్థంతి కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొనేది తక్కువ. అలాంటి సమయాల్లోనూ ఆయనపై విమర్శలు వస్తాయి. కానీ ఎప్పుడూ కేసీఆర్ అలాంటివాటిని లెక్క చేయరు. అదే సమయంలో ఆయన .. వారి పట్ల అగౌరవంగా ఉన్నా భవన కూడా ఎక్కడా రానీయరు. ముఖ్యంగా ఆయా నేతలను ఎక్కువగా అభిమానించే కుల సంఘాలు కూడా నోరెత్తవు.
అందుకే… అంబేద్కర్ జయంతిలో కేసీార్ పాల్గొనకపోయినా దళిత సంఘాలు నోరెత్తడం లేదని.. ఆయా సంఘాల నేతలు భయపడుతున్నారని బండి సంజయ్ లాంటి నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ బహిరంగసభలో పాల్గొనేందుకు హాలియా వెళ్తున్నారు. బహిరంగసభా వేదికపై రాజ్యాంగ రచయితకు వివాళులు అర్పించే కార్యక్రమం ఏర్పాటు చేస్తే… చేసినట్లే.. లేకపోతే లేదు.